Saturday, October 5, 2024
HomeతెలంగాణKCR at Vanaparthi: 119 నియోజకవర్గాల్లో కేసీఆర్లు ఉన్నరు

KCR at Vanaparthi: 119 నియోజకవర్గాల్లో కేసీఆర్లు ఉన్నరు

వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిని చేసిన మొనగాడెవ్వడు?

వనపర్తి; సీఎం కేసీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు

- Advertisement -

• మల్లా ఎన్నికలు వచ్చినయి. పది సంవత్సరాల్లో ఏంజరిగిందో అదంతా నిలువెత్తుగా మీ కండ్ల ముందు ఉంది.
• నిజనిజాలపై చర్చ మీ గ్రామాల్లో జరుగాలి
• ఎన్నికల్లో ఏం జరుగుతదో మీకు తెలుసు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు
• ఎన్నికలు వస్తా ఉంటాయి. పోతా ఉంటాయి. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. అప్పుడే బతుకులు బాగు పడుతయి.

• 24 ఏండ్ల పొద్దయింది. తెలంగాణ కోసం బయలు దేరి. 24 ఏండ్ల నాడు ఎవ్వడు లేడు. పిడికెడు మంది ఉన్నరు. అందులో నిరంజన్ రెడ్డి కూడా. ఒక్కడు ఎవ్వలు లేని నాడు ఉద్యమాన్ని ప్రారంభించినం


• ఈ రోజు విమర్శలు చేసే వాళ్లు ఎవ్వడు ఏ చెట్టుకింద ఉన్నడో మీ అందరికి తెలుసు. ఎవ్వడి బూట్టు మోసుకుంటున్నడో మీకు తెలుసు
• కేసీఆర్ నీకు దమ్మున్నదా; కొడంగల్ రా అని ఒకడు, గాంధీ బొమ్మకాడికి రా అని ఒకడు ..
• 119 నియోజకవర్గాల్లో కేసీఆర్లు ఉన్నరు కదా. ఇదేంది వనపర్తి కేసీఆర్ నా పక్కన్నే నిలబడి ఉన్నడు కదా
• వెనుకబడ్డ మహబూబ్ నగర్ లో పక్షుల్లా తిరిగాం. పాలమూరు బాగుపడాలని తపన పడ్డాం.
• ఇనాడు అవాకులు చవాకులు పేలుతున్నారు. చిన్నంత్రం, పెద్దంత్రం లేకుండా మాట్లాడుతున్నారు.

• మంది లేరు ఆనాడు మంత్రి పదవులు లేవు. రాష్ట్రమంతా తిరిగి ప్రజలను చైతన్య పరిచి, అద్భుతమైన పాటలు రాసి పాడుకున్నాం. సాయిచంద్, గోరేటి వెంకన్న లాంటి కళాకారులు తెలంగాణ మొత్తం ఒక్క గొంతై నినదిస్తే 2004 న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2014 దాకా తెలంగాణ ఇవ్వలేదు. 10 ఏండ్లు ఏడిపించిండ్లు.

• నేను చావునోట్లో తలకాయపెట్టి కేసీఆర్ శవయాత్ర నా..తెలంగాణ జైత్రయాత్రనా అని నినాదమిచ్చిఆమరణ నిరాహార దీక్ష చేస్తే తప్ప తెలంగాణ రాలేదు.

• ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ . నిధుల్లో, నియమకాల్లో అన్యాయం జరుగుతుంటే కొట్లాడిందెవరు. మౌనంగా ఉన్నదెవరు మీకు తెలుసు


• పెండింగ్ ప్రాజెక్టు అని పడావు పెడితే నీళ్లు రాలే. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం తెస్తే లక్ష ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి
• వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిని చేసిన మొనగాడెవ్వడు.

• ఉల్టా పల్టా మాటలు మాట్లాడే చిల్లరగాళ్లెవ్వరు.

• ప్రతి నీళ్ల చుక్కకోసం డీ8 కాలువ కోసం నిరంజన్ రెడ్డి కొట్లాడిండు

• ఏదుల నుంచి కూడా నీళ్లచ్చేటట్లు కొట్లాడిండు. రిజర్వాయర్ నిర్మాణం చేయించిందే నిరంజన్ రెడ్డి

• ప్రాజెక్టులకు అడ్డపడ్డది కాంగ్రెస్ పార్టీ , కాళ్లకు కట్టెలు పెట్టిండ్లు

• పాలమూరులో 9పంపులు వస్తాయి. ఐదు రిజర్వాయర్లతో పాలమూరు జిల్లాకు నీళ్లు వస్తాయి

• ఎవడైనా గంజి కేంద్రం పెడితే గుంజికొట్టే పరిస్థితులకు వచ్చాం

• శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి అద్భుతమైన మంత్రులు. వీరికన్నా దొడ్డుకున్నోళ్లు, ఎత్తుకున్నోళ్లు పాలించిండ్లు. ఒక్కడన్నా మెడికల్ కాలేజీలు తెచ్చిండా . మహబూబ్ నగర్ లో ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనులు మా మంత్రులు

• పశువైద్య కళాశాల కావాలని నిరంజన్ రెడ్డి అడుగుతున్నారు
• ముస్లీంలను ఓటు బ్యాంకు వాడుకున్నది కాంగ్రెస్

• తెలంగాణను ఒక పూల పొదరిల్లులాగా చేసుకుంటున్నాం

• కొత్తకుండలా ఈగ చొచ్చినట్లు. సంసారం చదురుకున్నట్లు శ్రద్ధతో, పద్ధతితో తెలంగాణు అభివృద్ధి చేసుకున్నాం.
• పెన్షన్లు ఇచ్చుకున్నం. విధి వంచితుల కోసం ఇద్దామనే మానవీయ కోణంతో ఇచ్చుకున్నాం
• పేదోళ్ల వద్ద కొసరొద్దని చెప్పి రూ.1000 పెట్టుకున్నాం. పెంచుకున్నాం. కల్యాణలక్ష్మి కూడా పెంచుకున్నాం. ఎన్నికల కోసం కాదు. పెన్షన్లను వేలల్లో తీసుకుపోయింది ముఖ్యమంత్రి కేసీఆర్
• రైతుబంధు గురించి ఆలోచించినోడు లేడు. ప్రపంచంలో దీనిని పుట్టించిందే కేసీఆర్. ఎన్ని సర్కార్ లు వచ్చినా రైతులకు ఏమీ చేయలేదు. తెలుగుదేశం, కాంగ్రెస్ వచ్చినా రైతులకు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు.
• నేను కాపోడినే . రైతుల కష్టాలు తెలుసు. అందుకే రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం.
• సుమారు లక్ష కోట్లు ఖర్చు పెట్టి 24 గంటలు కరెంటు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్నది
• రాయేందో రట్నమేందో మీకు తెలుసు

• కర్ణాటకలో కరెంటు 5 గంటలు కూడా ఇస్తలేరు. 24 గంటలు ఇస్తమన్నరు కర్నాటకలో కాంగ్రెసోళ్లు, ఎల్లెలుకల పడ్డారు. అక్కడ పంటలు ఎండిపోతున్నాయి.

• రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని ధరణి తెచ్చినం ధరణిని తీసేస్తామని రాహూల్ గాంధీ, రేవంత్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్క చెబుతున్నారు. మీ బొటన వేలితోనే భూమి బదలాయింపు అవుతుంది. మీ భూమి స్వాధీనంలో పెట్టిన ప్రభుత్వం కావాలా? ధరణి లేకపోతే ఎన్ని కోర్టు కేసులయ్యేవి. ధరణి వల్ల సమాజం శాంతిగా ఉంది.

• దళిత సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దళితుల గురించి ఆలోచించలేదు. ఓటుబ్యాంకు మాదిరిగా వాడుకున్నారు. దళితబంధును నెహ్రూ కాలంలోనే అమలు చేసి ఉంటే దళితుల పరిస్థితి మెరుగ్గా ఉండేది. భారత దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నోట్ల నుంచి రాలేదు. దళితబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్.

• నిరంజన్ రెడ్డి కోరిన అభివృద్ధి పనులు మంజూరు చేయిస్తాను. గొప్ప పట్టణంగా వనపర్తి వెలుగొందుతది. నిరంజన్ రెడ్డిని ఆలోచించాలి. బ్రహ్మండమైన మెజారిటీతో గెలిపించాలి.

• వాల్మీకి సోదరుల గురించి తీర్మాణం చేశాం. మోడీ ప్రభుత్వం మొద్దు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని చెప్పారు.

• ముస్లిం సోదరులకు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినం. అందరికీ కలిపి అన్ని వర్గాలకు కలిపి1000 కళాశాలలు పెట్టినం. రాబోయే రోజుల్లో డిగ్రీ కళాశాలలు కూడా చేసుకోవాలే. ఈ మధ్య అగ్రకుల పేదలకు కూడా గురుకులాలు నిర్మించాలని నిర్ణయించాం.

• మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస గౌడ్, ఎమ్మెల్సీలు మధుసూదన చారి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహాం, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మందా జగన్నాథం, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News