Friday, September 20, 2024
HomeతెలంగాణPalakurthi: ఎర్రబెల్లి నామినేషన్ ఖర్చులకు డబ్బులిచ్చిన స్థానికులు

Palakurthi: ఎర్రబెల్లి నామినేషన్ ఖర్చులకు డబ్బులిచ్చిన స్థానికులు

10,000 రూపాయలు జమ చేసిచ్చిన కుట్టు శిక్షణ ట్రైనర్లు

పాలకుర్తి నియోజకవర్గ బి అర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నామినేషన్ ఖర్చులకు రాయపర్తి, తొర్రూరు, పెద్ద వంగర కుట్టు శిక్షణ ట్రైనర్లు 10 వేల రూపాయలు జమ చేసి ఇచ్చారు. ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ, ఎర్రబెల్లి ట్రస్టు అధ్వర్యంలో గత కొద్ది రోజులుగా ఉచిత శిక్షణ కొనసాగుతున్నది.

- Advertisement -

కాగా, శిక్షణ ఇచ్చిన ట్రైనర్లు తమ కృతజ్ఞతను చాటుకుంటూ, చందాల రూపంలో వేసుకొని ఆ మొత్తాన్ని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అందచేశారు. తమ పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వారికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News