దేశ రాజధానిలో చలి వణికించేస్తోంది. దీంతో నైనిటాల్ కంటే అతి చల్లని ప్రదేశంగా ఈరోజు ఢిల్లీ ఉష్ణోగ్రతలు నమోదు కావటం హైలైట్. ఈరోజు ఉదయం ఢిల్లీలో ఏకంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చల్ల గాలులతో రాజధాని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎటు చూసినా పొగ మంచుతో నగరమంతా కప్పేసినట్టుంది. దీంతో విజిబిలిటీ కూడా బాగా తగ్గింది. ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు 5.6 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాలనీ పొగ మంచులో కూరుకునిపోయాయి. ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఫాగ్ ఎక్కువగా కనిపిస్తోంది. గాలిలో తేమ అత్యధికంగా ఉండటం మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో రాత్రిపూట, తెల్లవారు ఝామున ఢిల్లీలో డ్రైవింగ్ చేయటం సవాలు కూడుకున్న పనిగా మారింది. మరో 48 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగే సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.
New Delhi: నైనిటాల్ కంటే చల్లగా న్యూఢిల్లీ !
సంబంధిత వార్తలు | RELATED ARTICLES