Sunday, October 6, 2024
HomeతెలంగాణLB Nagar: దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రచార దూకుడు

LB Nagar: దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రచార దూకుడు

పెండింగ్ సమస్యలు కూడా పూర్తి చేస్తా

ఎల్.బి.నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వారి సతీమణి కమల సుధీర్ రెడ్డి నాగోల్ డివిజన్ పరిధిలోని జైపూరికాలనీ లోని డి.ఆర్.ఎఫ్ కేంద్రం దగ్గర ఉన్న హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి ప్రచారానికి జనం నీరాజనాలు పలికారు.అడుగడుగునా డప్పు చప్పుళ్లు, ఆటలు ,పూలవర్షంతో ఆదరిస్తూ, మహిళలు మంగళ హారతులు పట్టి, నుదుటన కుంకుమ తిలకం దిద్ది శాలువాలు, పూలమాలలతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొన్నిచోట్ల కాలనీ సంఘాలు, అసోసియేషన్లు, బస్తీవాసులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి కారు గుర్తుకు ఓటు వేస్తామని తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టో చూసి ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అని తెలిపారు. మరోసారి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకొనివెళ్తా అని తెలిపారు.

బిసి, ఎస్సి, ఎస్టి, మహిళలు, మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. ఇతర రాష్ట్రాలు సైతం తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి అని తెలిపారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గన్ని వేల కోట్ల రూపాయల నిధులతో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. మరికొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా ప్రణాళికబద్దంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఎల్బీనగర్ చౌరస్తాని ప్రీ సిగ్నల్ చౌరస్తాగా మార్చామన్నారు. ఎస్ఆర్డిపీ పనుల్లో భాగంగా చాలా వరకు పనులు తుదిదశకు చేరుకున్నాన్నారు.

దాదాపు అన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులు పూర్తయ్యాయన్నారు. ఎల్.బి.నగర్ జంక్షన్ వద్ద కుడి, ఎడమ ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, నాగోల్ జంక్షన్ ఫ్లై ఓవర్, కామినేని జంక్షన్ వద్ద రెండు వైపులా ఫ్లై ఓవర్లు, చింతలకుంట జంక్షన్ వద్ద అండర్ పాస్, బైరమల్ గూడ (ఆలేఖ్య టవర్స్) జంక్షన్ వద్ద రెండు ఫ్లైఓవర్లు నిర్మించామన్నారు. ప్రస్తుతం ఆలేఖ్య టవర్స్ వద్ద సెకండ్ లెవెల్ నూతన స్కై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు గతంలో ప్రారంభమైందన్నారు. పనులు పూర్తి అయ్యాక ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉండవని తెలిపారు. రాబోయే రోజుల్లో మెట్రో రైలును హయత్ నగర్ వరకు తీసికొనిపోవడానికి నా వంతు కృషి చేస్తానన్నారు. నాగోల్ దగ్గర నూతన సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించామన్నారు. కరోనా సమయంలో ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే రోడ్డు వెడల్పు పనులు,ఫ్లై ఓవర్ పనులు వేగవంతంగా చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గరాపు దయానంద్ గుప్తా, మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు ఆనంతుల రాజిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి, మహిళా అధ్యక్షురాలు ప్రమీల, సీతారాములు గౌడ్, ఆజాద్, నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, యువ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, వివిధ విభాగాల కమిటీ సభ్యులు, పలు కాలనీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News