Friday, September 20, 2024
HomeతెలంగాణThanikella @ Suryapeta: జాషువా పద్యం చదువుతూ స్మశానంలో కలియతిరిగి..

Thanikella @ Suryapeta: జాషువా పద్యం చదువుతూ స్మశానంలో కలియతిరిగి..

శివయ్య చెంత చిత్తంతో పరవశించి పోయిన తనికెళ్ల భరణి

సమయం అర్థరాత్రి 1:30 గంటలు. పట్టణ ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్న వేల మహ ప్రస్థానంలో కొలువైన పరమశివుడి చెంత చిత్తంలో మునిగిపోయారు సినీ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి. సూర్యాపేటలో రాత్రి సాహిత్య సభ కు హాజరైన భరణి, అక్కడ కవుల ప్రసంగంలో మహప్రస్థానం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

- Advertisement -

వెంటనే సందర్శించాలని నిర్ణయించుకున్న తనికెళ్ళ, తన మనసులోని కోరికను సభకు ముఖ్య అతిథిగా హాజరైన జగదీష్ రెడ్డికి తెలిపారు. ఆయన అడిగిందే తడవుగా అర్ధరాత్రి 1:30 గంటలకు తనికెళ్ల భరణిను మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా మహాప్రస్థానం వద్దకు తీసుకెళ్లారు.

వాహనం దిగుతూనే ప్రస్థానంలో కొలువై ఉన్న పరమశివుడి విగ్రహాన్ని చూసి పరవశించిపోయారు. గంట సేపు శివ చిత్తంలో మునిగితేలారు. స్మశాన వాటిక నలుమూలల కలియ తిరుగుతూ మహా అద్భుతం అంటూ జాషువా పద్యాన్ని నెమరవెసుకున్నారు.

ఇచ్చోట నేసత్కవీంద్రుని కమ్మని
కలము, నిప్పులలోనఁ గఱఁగిపోయె
యిచ్చోట నేభూములేలు రాజన్యుని
యధికారముద్రిక లంతరించె
యిచ్చోటనే లేఁత యిల్లాలి నల్లపూ
సలసౌరు గంగలోఁ గలసిపోయె

అంటూ ఇంతటి అద్భుత మహాప్రస్థానాన్ని 20 ఏళ్ల క్రితం యూరప్ లో చూశాను అన్న తనికెళ్ళ, అక్కడ సైతం స్మశానం ఇరుకుగా ఉందన్నారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా సూర్యాపేటలోనే అంతటి నిర్మాణాన్ని చూస్తున్నానని తెలిపారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సువిశాలంగా, అహ్లాదకరంగా రూపుదిద్దుకున్న మహాప్రస్థాన దర్శనభాగ్యం ఇచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి తో ధన్యోస్మి అంటూ ఆనందబాష్పాలతో వెనుదిరిగారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News