Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్China: మెట్టు దిగిన జిన్‌ పింగ్‌

China: మెట్టు దిగిన జిన్‌ పింగ్‌

అమెరికాతో చైనా సత్సంబంధాలు శుభసూచికం

చైనా అధ్యక్షుడు ఎట్టకేలకు అమెరికాతో సయోధ్య పెంచుకోవాలని చూస్తున్నారు. అగ్రరాజ్యంతో విబేధాలు సరికాదని ఆలస్యంగా గుర్తించినా, ప్రస్తుతానికి చైనాకు అమెరికా సాయం ఎంతో అవసరం. అబేధ్యమైన రక్షణ వ్యవస్థ, సాంకేతిక నైపుణ్యం అమెరికా సొత్తు. అమెరికాలో అత్యున్నత విద్యను అభ్యసిస్తూ, పలు ఉద్యోగాలలో ఉన్నవారిలో భారతీయులు తర్వాత చైనా వాళ్ళదే పైచేయి. రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని, అందుకు చైనా సిద్ధంగా ఉందని జిన్‌ పింగ్‌ భావంగా కనిపిస్తోంది. దేశాల పురోగతి, అభివృద్ధికి మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామని చెప్పారు. ఒక అగ్రదేశంతో స్నేహాన్ని, సయోధ్యను కోరుకుంటున్నామని జిన్‌ పింగ్‌ ప్రకటించడం పలువురిని ఆశ్చర్యపరచింది. నిన్న, మొన్నటి వరకు అమెరికాపై అవాకులు, చెవాకులు పేలుతూ అగ్రరాజ్య నిరోధానికి ఉత్తర కొరియాతో చేతులు కలపడం తెలిసిందే. గౌరవంతో కూడుకున్న ప్రయోజనాలు, శాంతితో కలసి నడవటం, మనుగడ సాధించడం, రెండింటికి ప్రయోజనం కలిగేలా సహకరించుకోవాలని, చైనా సానుకూల దృక్పధం చూపిస్తోంది. జిన్‌ పింగ్‌ హఠత్తుగా అమెరికాతో సయోధ్య అని ప్రకటించడం శుభపరిణామమే అయితే చైనా ఎంత వరకు అగ్రదేశంతో కలసి ఉండగలదు ప్రశ్న. ఇదంతా అమెరికా గమనిస్తూనే ఉంది. నవంబర్‌ మాసంలో అమెరికాలోని శాన్‌ ప్రాన్‌ సిస్కోలో ఆసియా పసిఫిక్‌ ఆర్ధిక సహకార సదస్సు (అపెక్‌ ) ఉండటం, ఆ సదస్సులో అమెరికా, చైనా విదేశాంగ మంత్రులు కలవడం శుభసూచకం. ఇందు నిమిత్తం చైనా విదేశాంగ మంత్రి అమెరికాకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా అండలేకపోతే కష్టమనే మిషతో జిన్‌ పింగ్‌ తెలుసుకున్నారు.
రష్యాతో, ఉక్రైన్‌ ధీటుగా పోరాడుతుండటంతో అమెరికా, ఉక్రైన్‌ కు చేస్తున్న సాయం యుద్ధం తీవ్రరూపం దాల్చడం, ఉక్రైన్‌ ధీటుగా పోరాడుతుండటం చైనా గ్రహించింది. అందుకే అపెక్‌ సదస్సుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. అపెక్‌ సదస్సుకు సభ్యదేశాలన్నీ హాజరుకావచ్చు. ఇక్కడ చైనా ఉద్దేశం ఏమిటంటే ఆసియా పసిఫిక్‌ దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పటమే. ప్రపంచంలో అన్ని దేశాలతో మేము సఖ్యతగా ఉన్నామని తెలియపరచుకొనుటయే కావచ్చు. కాకపోతే నిన్నా, మొన్నటి వరకు అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న చైనా, మాట మార్చి అగ్ర దేశంతో సహకారం ఆశించడం, ఇరువురు కలసి పని చేస్తామని చెప్పటం ఉత్తర కొరియాకు సంకటంగా ఉండొచ్చు. అదేరీతిలో దక్షిణ కొరియా ఎట్టి పరిస్థితులలోనూ చైనా స్నేహాన్ని కానీ, సహాయం కానీకొరదు. ఎందుకంటే అమెరికా అన్ని విషయాలతో దక్షిణ కొరియాకు అండగా ఉంది. అమెరికాతో సయోధ్య అనటం చూసి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ కు పడకపోవచ్చు. చైనా, ఉత్తర కొరియా రెండు దేశాలు విశ్వంలో అమెరికా పెత్తనం నిలువరించాలనే యోచనలో ఉన్నాయి..
కానీ చైనా, అమెరికాతో సయోధ్యకు సిద్ధమని ప్రకటించడంతో ఉత్తర కొరియాకు పాలుపోని పరిస్థితి ఎదురయింది. ఇప్పుడు ఆలోచనతో ఉత్తర కొరియా ఉంది. కానీ చైనా మాత్రం తన విదేశాంగ మంత్రిని అమెరికాకు పంపటానికి సిద్ధంగా ఉంది. ఈ దిశలో జిన్‌ పింగ్‌ మాట్లాడుతూ అమెరికా, చైనా సంబంధాలపై జాతీయ కమిటీ వార్షిక విందు (గాలా డిన్నర్‌ ) కోసం శుభాకాంక్షలు తెలుపుతూ ఒక సందేశం పంపటం విశేషం. ఈ సందేశంలో మా మధ్య వైరుధ్యాలున్న వాటిని అధికమించి మళ్ళీ దీర్ఘకాలిక సహకారాన్ని పొందుతామని, ప్రశంసలు అందుకున్న హేన్రే కిస్సింగర్‌ను అభినందించారు. విశ్వంలోనే రెండు ప్రధాన దేశాలయిన అమెరికా, చైనాలు కలసి కట్టుగా విశ్వంలో దేశాల మధ్య శాంతి నెలకొల్పడం, ఆయా దేశాలు సుస్థిర అభివృద్ధి కోసం సరైన ప్రణాళికలు, చర్యలు తీసుకోవడం వాటికి ప్రోత్సహం, దిశా నిర్దేశం చేయగలవు. మానవాళి ఉజ్వల భవిషత్తుకు మార్గదర్శకం చేయగలరని జిన్‌ పింగ్‌ అభిప్రాయం. అమెరికాతో పరస్పర గౌరవ భావంతో కలసి నడవడం, ఇరువురికి ప్రయోజనం ఉండేలా సహకరించుకోవడం, అమెరికాతో కలసి పనిచేసేందుకు చైనా సానుకూలంగా ఉందని జిన్‌ పింగ్‌ చెప్పటం గమనార్హం. ఇంకా జిన్‌ పింగ్‌ ద్వైపాక్షిక సంబంధాలకు పిలుపు నిచ్చారు. త్వరలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యూ అమెరికాను సందర్శించి సంబంధాలు మెరుగుపరచుకుంటారని తెలిపారు. రెండు దేశాలు కలిస్తే అదో చరిత్ర అవుతుంది. ముఖ్యంగా ఈ దేశాల మధ్య ఉన్న అంశాలు ఏంటంటే రష్యా, ఉక్రైన్‌ యుద్ధం ఆగాలి.
రష్యాకు ఈ మధ్య కాలంలోనే మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు చైనా, అమెరికాతో సంబంధాలు నెరపుతుండటంతో చైనా మాట రష్యా వింటుందా అనేది ప్రశ్న. రష్యాకు భారత్‌ ఎన్నోసార్లు టెలిఫోన్‌ ఫోన్‌ ద్వారా సంభాషించింది. యుద్ధం వలన వినాశనం, పౌరులలో చెడ్డపేరు వస్తుందని తెలియచేసింది. అభివృద్ధికి దేశాలు సహకరించుకోవడం వేరు, యుద్ధంతో దేశాల మధ్య వైరి ఉండటం వేరు. విశ్వంలో ఎక్కడా యుద్ధం అనే మాట వినపడకూడదు.. శాంతిని కోరుకునే దేశాలు మాతో చేయి కలపండి అని ఒక శాంతి కూటమి చైనా, అమెరికా ఏర్పాటు చేయాలి. భారత్‌ కూడా శాంతికాముక దేశం కనుక భారత్‌ ను కూడా చేర్చుకోవాలి. ఎన్నో సంస్థలలో చైనా, అమెరికా సభ్యదేశాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి భద్రతమండలిలో రెండు దేశాలు శాశ్వత సభ్య దేశాలు. కాబట్టి విశ్వంలోని ప్రతి దేశం శాంతికి ప్రాముఖ్యత ఇస్తాయి. ఇజ్రాయెల్‌, గాజాపై చేస్తున్న దాడులు కూడా రెండు దేశాలు (చైనా, అమెరికా) ఆపాలి. అటు పాలస్టీనా పౌరులను, ఇటు ఇజ్రాయెల్‌ పౌరులను ఆదుకోవాలి. అభివృద్ధి, సుస్థిర శాంతి, ప్రగతి తర్వాత. ముందు యుద్ధం విశ్వంలో ఎక్కడా జరగకూడదు. ఐక్యరాజ్య సమితి పాత్ర ఇప్పుడు పరిమితంగా ఉంది. కాబట్టి అమెరికా, చైనా నడుంబిగించి విశ్వంలో శాంతి వీచికలు పూయిస్తాయని ఆశిద్దాం. మొత్తానికి చైనా అధ్యక్షుడు ఓ మెట్టు దిగి అమెరికాతో సంబంధాలు నెరపడం శుభపరిణామం. ఇదే స్నేహం దీర్ఘకాలంగా ఉండాలని, ఏదో మొక్కుబడిగా ఉండకూడదని కోరుకుందాం.

  • కనుమ ఎల్లారెడ్డి,
    పౌరశాస్త్ర అధ్యాపకులు,
    93915 23027.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News