నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ సౌజన్యంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని బూర్గులతండా గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని, మంగళవారం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డి శ్రీనివాస్,నేరేడుచర్ల జడ్పిటిసి రాపోలు నర్సయ్య కలిసి ప్రారంభించారు. ఈ ఉచిత శిబిరంలో పశువుల ఆరోగ్యం పరిశీలించి, గర్భకోశ వ్యాధుల చికిత్స అందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 15 జనరల్ కేసులతోపాటు, 43 గర్భకోశ సమస్యలు ఉన్న పశువులకు చికిత్స అందించామని, 25 దూడలకు నట్టల మందు తాపించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి బి. రవి నాయక్, శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ నాగేంద్ర, ఎన్ శ్రీకాంత్, నేరేడుచర్ల ఏడి శంకర్రావు, మాలోత్ నాగు నాయక్, గ్రామపంచాయతీ సిబ్బంది,పశు వైద్య సిబ్బంది, నరసింహ చారి, భాస్కర్, స్వప్న, మార్కెట్ కమిటీ కార్యదర్శి, సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.