Saturday, April 19, 2025
HomeదైవంAhobilam: లక్ష్మీ నరసింహ స్వామి పవిత్రోత్సవాలు

Ahobilam: లక్ష్మీ నరసింహ స్వామి పవిత్రోత్సవాలు

సంప్రదాయబద్ధంగా సాగిన ఉత్సవాలు

అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో సంవత్సర ప్రాయాశ్చితార్థం నిర్వహించే పవిత్రోత్సవంలో భాగంగా శనివారం నాడు దిగువ అహోబిలంలో ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ మఠం ప్రతినిధి సంపత్ ఆలయ ఓఎస్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేకంగా సాంప్రదాయబద్ధంగా అలంకరించి అనంతరం శ్రీ స్వామివారికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. చతుస్థానార్చన, పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి పవిత్ర సమర్పణ చేశారు. ఆలయ పూజార్ల ఆధ్వర్యంలో సాంప్రదాయ బద్ధంగా హోమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారిని నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. స్వామివారిని చూసినభక్తులు తన్మయంతో నరసింహ స్వామి గోవిందా గోవిందా అంటూ స్మరించుకున్నారు.

- Advertisement -

నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి
పవిత్రోత్సవాల్లో భాగంగా నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి ఎగువ దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పవిత్రోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆయనకు ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాల అందజేశారు. కేంద్ర మాజీ కాటన్ బోర్డు మెంబర్ చింతకుంట శ్రీనివాసరెడ్డి, అమర్నాథరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News