Friday, April 18, 2025
HomeతెలంగాణPilot Rohit Reddy: పరాయి వ్యక్తులు వాలిపోయారు

Pilot Rohit Reddy: పరాయి వ్యక్తులు వాలిపోయారు

తాండూరు పౌరుషాన్ని చూపించండి

తాండూర్ లో రెండు రోజుల నుంచి వాడవాడ పలకరింపు కార్యక్రమంలో జనాల నోటి నుండి మీరే గెలుస్తారని అంటున్నారు. తాండూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో పరాయి వ్యక్తులు వాలిపోయారు. కొనుగోలు కేంద్రం పెట్టి డబ్బు అంచులతో రాజకీయం చేయాలనుకుంటున్నారు, ఇన్ని రోజులు తాండూరు మొహం చూడని వ్యక్తులు తాండూరు బాగు చేస్తామని చెబుతున్నారని ఇది ఎంతవరకు సమంజసం అలాంటి వ్యక్తులను తాండూరు ప్రజలు నమ్మరు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరేస్తున్నాను అన్నారు. తాండూర్ కు నర్సింగ్ కాలేజ్ తీసుకువచ్చాను ప్రభుత్వ ఐటిఐ పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రారంభించాము, మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి పేదలకు మెరుగైన వైద్యము అందిస్తున్నాము, ప్రతి కోటి రూపాయలు మంజూరు చేసి పనులు చేపట్టాము తాండూరుకు వరద ముప్పు లేకుండా 16 కోట్లతో చిలకవాదులు అభివృద్ధి చేశాను నేను తాండూర్ బిడ్డను కావడంతో తాండూర్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాను అని వివరించారు.

- Advertisement -

మీ ఆశీర్వాదముతో మరింత అభివృద్ధి చేస్తాను ఎన్నికల్లో తాండూరు పౌరుషాన్ని చూపిద్దాం. పరాయి వ్యక్తులను తరిమి కొడదాము రెండవసారి తాండూర్ పట్టణంలో పాదయాత్రలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జోష్ మీద ప్రజలను పలకరింపులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు, మహిళలు కార్యకర్తలు పాల్గొని క విజయవంతంగా నడిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News