సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
-భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో దాదాపు 92 కౌంటర్ల ద్వారా. సర్వదర్శనం టోకెన్లు జారీ.
స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు :
– జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజులకు గాను జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభిస్తాం. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా 4 లక్షల 50 వేల టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం . భక్తులకు త్వరిత గతిన దర్శనం చేయడం కోసం చేసిన ఈ ఏర్పాట్లను గమనించి భక్తులు టోకెన్ తీసుకున్నాకే తిరుమలకు రావాలని విజ్ఞప్తి.
-తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూల్, విష్ణునివాసం, శ్రీనివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల(మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్), ఎమ్.ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ వెనుక వైపున గల శేషాద్రి నగర్‌లోని జెడ్‌పి హైస్కూల్, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద టోకెన్లు జారీ చేస్తాం.
-ఈ టోకెన్ కేంద్రాల వద్ద భక్తుల కొరకు అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు, టి, కాఫీ అందిస్తాం. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తాం.
-తిరుమల స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహంలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.
– ఉచిత టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలి.
– తిరుపతిలో 9 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సర్వదర్శనం కౌంటర్లకు సులువుగా వెళ్లేందుకు వీలుగా ఆయా కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశాం. భక్తులు సెల్‌ఫోన్ ద్వారా స్కాన్ చేసి గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లను గుర్తించవచ్చు.
– భక్తులకు సమాచారం ఇచ్చేందుకు గాను చెర్లోపల్లి జంక్షన్, తిరుచానూరు వద్ద పూడి రోడ్డు, నవజీవన్ ఆసుపత్రి వెనుక హైవే వద్ద తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతాల్లో కూడా సమీపంలోని సర్వదర్శనం కౌంటర్ల క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తాం.
రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు :
– జనవరి 1, 2 నుండి 11వ తేదీ వరకు కలిపి మొత్తం 2.05 లక్షల టికెట్లు విడుదల చేశాం.
శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు :
– జనవరి 2 నుండి 11వ తేదీ వరకు రోజుకు 2 వేలు చొప్పున దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేశాం. వీరికి కూడా మహాలఘు దర్శనం ఉంటుంది.
టికెట్ల లభ్యతను తెలుసుకోండి :
– భక్తులు టిటిడి వెబ్‌సైట్, ఎస్వీబీసీ ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాల్సిందిగా మనవి.
-భక్తులు కిలోమీటర్ల పొడవున క్యూలైన్లలో ముందుగానే వచ్చి నిరీక్షించకుండా టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరడమైనది.
గదులు :
-నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దృష్ట్యా డిసెంబర్ 29 నుండి జనవరి 3 వరకు వసతి అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేయడమైనది.
-తిరుమలలో వసతిగృహాలు పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తాము పొందిన టికెట్లు లేదా టోకెన్లపై సూచించిన తేదీ మరియు సమయానికి మాత్రమే తిరుమలకు దర్శనానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
శ్రీవారి ఆలయం :
-సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుండి 11వ తేదీ వరకు స్వయంగా వచ్చే రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుంది. ఒక వి ఐ పి కి రెండు గదులు మాత్రమే కేటాయిస్తాం.
– జనవరి 2 మరియు 3 వ తేదీల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఆ తరువాత రద్దీని బట్టి నిర్ణయం తీసుకుంటాము.
-వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
-వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.
-లడ్డూ కాంప్లెక్సులో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 3.5 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచడం జరుగుతుంది.
వెనుకబడిన ప్రాంతాల వారికి వైకుంఠ ద్వార దర్శనం :
-రాష్ట్రంలోని గిరిజన , వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పేదవర్గాల వారికి రోజుకు వెయ్యి మంది చొప్పున 10 రోజులకు కలిపి సుమారు 10 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం.
అన్నప్రసాదం :
– అన్నప్రసాద భవనంలో 10 రోజుల పాటు ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. అదేవిధంగా, వైకుంఠం క్యూకాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు, ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, తాగునీరు, టీ , కాఫీ పంపిణీ చేస్తాం.
కల్యాణకట్ట :
-తలనీలాలు తీసేందుకు తగినంత మంది క్షురకులను అందుబాటులో ఉంచడం జరిగింది.
-భక్తుల సౌకర్యార్థం రెండు ఘాట్ రోడ్లు 24 గంటల పాటు తెరిచి ఉంచబడతాయి.
డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో ఎస్‌ఎస్‌డి టోకెన్ల రద్దు :
-డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో తిరుపతిలోని కౌంటర్లలో ఎస్‌ఎస్‌డి టోకెన్లు ఇవ్వబడవు.
-అదేవిధంగా, ఈ రెండు తేదీల్లో ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు కూడా ఇవ్వబడవు.
– గోవింద మాల భక్తులు టోకెన్ తీసుకునే తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవాలని, టోకెన్ లేకుండా తిరుమలకు వచ్చి ఇబ్బంది పడవద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
మాస్క్ ధరించి రావాలి
కోవిడ్ మళ్ళీ వ్యాపిస్తున్న పరిస్థితులు నెలకొన్నందువల్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ మార్గ దర్శకాలు జారీ చేశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నందువల్ల అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
TTD: 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం..వేంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే ఇవన్నీ తప్పనిసరి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES