Sunday, October 6, 2024
Homeహెల్త్Canned cool drinks are too dangerous: క్యాన్డ్ డ్రింక్స్ డేంజరస్

Canned cool drinks are too dangerous: క్యాన్డ్ డ్రింక్స్ డేంజరస్

క్యాన్డ్ డ్రింకు తాగుతున్నారా…అయితే జాగ్రత్త
డ్రింకును ప్యాకేజీ చేయడానికి ఉపయోగించే చిన్న చిన్న క్యాన్ డబ్బాల నుంచి నేరుగా డ్రింకు తాగుతున్నారా? అది అస్సలు మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. తాగడానికి సులువుగా
ఉంటాయని క్యాన్డ్ డ్రింక్స్ ను చాలామంది వాడడం చూస్తుంటాం. అలా నేరుగా క్యాన్డ్ డ్రింకు తాగడం వల్ల
రకరకాల సైడ్ ఎఫెక్టుల బారిన పడతారని పోషకాహార నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

- Advertisement -


క్యాన్డ్ డ్రింకును నేరుగా సిప్ చేస్తూ తాగే అలవాటు ఉంటే దాన్ని వెంటనే మానుకుంటే మంచిదని కూడా
ఆహారనిపుణులు సలహా ఇస్తున్నారు. అలా తాగడం వల్ల క్యాన్స్ నుంచి సోకే జబ్బుల కారణంగా రకరకాల
అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని పోషకాహారనిపుణురాలు సిమ్రన్ చోప్రా అంటున్నారు. క్యాన్డ్ డ్రింకులు ఆరోగ్యానికి ఎంతో హానికరమని అంటున్నారు. ఫ్రాస్టీ బెవరేజెస్ లో వాడే ఈ క్యాన్స్ వల్ల
శరీరంలో రకరకాల ఇన్ఫెక్షన్లతో బాటు బాక్టీరియా చేరే అవకాశాలున్నాయంటున్నారామె. చిన్న అనారోగ్య
సమస్యల నుంచి పెద్ద అనారోగ్య సమస్యలు దాకా సోకే ప్రమాదం ఉందంటున్నారు. క్యాన్డ్ డ్రింకులు
తాగేటప్పుడు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కొన్ని టిప్స్ కూడా సిమ్రన్ తెలిపారు. క్యాన్డ్ డ్రింకులు తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు తీవ్రమైనవని ఆమె చెప్పారు.


ఈ క్యాన్స్ ను ఎక్కడో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ లో తయారుచేస్తారు. ఆతర్వాత వాటిని బెవరేజెస్ కంపెనీకి పంపుతారు. ఆ కంపెనీ వీటిని నేరుగా తీసుకెళ్లి గిడ్డంగిలో పడేసి అక్కడి నుంచే ప్యాకేజ్ డ్రింకుకు గాను ఆ క్యాన్లను శుభ్రం చేయకుండానే వాడుతుంది. ఆ క్యాన్డ్ డ్రింకును వినియోగదారులు నేరుగా తాగుతారు. స్టోరేజ్ లో ఉన్న ఈ క్యాన్లపై ఎలుకలు తిరుగుతుంటాయి. వాటిపై మలమూత్ర విసర్జనలు కూడా చేస్తుంటాయి. అలాంటి క్యాన్ నుంచి డ్రింకును నేరుగా తాగడం వల్ల లిప్టోసిరోసిస్ అనే జబ్బు వాటిని ఉపయోగించిన వినియోగదారులకు సోకే అవకాశం ఉంది. ఇది బాక్టీరియల్ జబ్బు.

మనుషులకు, జంతువులకు కూడా ఈ జబ్బు సోకుతుంది. లెప్టోసిరోసిస్ వల్ల తలెత్తే సమస్యల గురించి
కూడా సింమ్రాన్ పలు విషయాలు పంచుకున్నారు. మనుషులలో రకరకాల లక్షణాలతో ఇది కనిపిస్తుందిట. ఇతర జబ్బుల్లో కనిపించే లక్షణాలుగా కూడా ఈ బ్యాక్టీరియల్ జబ్బులో కనిపిస్తాయిట. కొందరు పేషంట్లల్లో దీనికి సంబంధించిన లక్షణాలు ఏమీ కనిపించకుండా ఉండే అవకాశం కూడా ఉందిట. లెప్టోసిరోసిస్ లక్షణాల్లో ముఖ్యంగా తలనొప్పి, జ్వరం, పొత్తి కడుపు నొప్పి, డయేరియా వంటివి ఉంటాయి. ఈ క్రమంలో తలెత్తే సమస్యల వల్ల కాలేయం, కిడ్నీలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

క్యాన్స్ వాడకం వల్ల సోకే ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోలేదు. క్యాన్ లో ఉన్న డ్రింకును గ్లాసులో పోసుకుని తాగొచ్చు. అలా తాగాలని లేకపోతే క్యాన్ ను శుభ్రంగా కడిగి, పొడిగా తుడిచి ఆ తర్వాత అందులో డ్రింకు పోసుకుని తాగొచ్చు. క్యాన్ మూత పగలగొట్టి అందులో స్ట్రా వేసుకుని కూడా డ్రింకు తాగొచ్చు. అదండి విషయం. మరి మీరు క్యాన్డ్ డ్రింకును తాగే ముందు ఈ విషయాలు మర్చిపోవద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News