Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Train accident in AP: రైలు ప్రమాదంపై కంట్రోల్ రూం

Train accident in AP: రైలు ప్రమాదంపై కంట్రోల్ రూం

రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

చినరావుపల్లి వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితుల సహాయం కోసం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు: జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి

- Advertisement -

➡️ బాధితుల సహాయ సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157 తో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు

➡️ బాధితుల సహాయ సమాచారం కోసం ఏర్పాటు చేసిన రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 8978080006 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు : జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి

విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News