Tuesday, November 26, 2024
Homeఇంటర్నేషనల్Kavitha to UK Oxford: ఆక్స్ ఫర్డ్ కు బయలుదేరిన కల్వకుంట్ల కవిత

Kavitha to UK Oxford: ఆక్స్ ఫర్డ్ కు బయలుదేరిన కల్వకుంట్ల కవిత

'ద తెలంగాణ మోడల్' పై కవిత ప్రసంగం

యూకేలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం చేయడానికి ఆదివారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయలుదేరి వెళ్లారు. “ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూసివ్ డెవలప్మెంట్ : ద తెలంగాణ మోడల్” అనే అంశంపై ఈ నెల 30న కీలకోపన్యాసం చేయాల్సిందిగా కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానించిన విషయం విధితమే.

- Advertisement -

ఆదివారం నాడు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ విమానాశ్రయంలో కవితకు ఘనవీడ్కోలు పలికారు. అంతర్జాతీయ వేదికపై సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధిని అవిష్కరించే అవకాశం లభించినందుకు కార్యకర్తలు కవితను అభినందించి శుభకాంక్షలు తెలియజేశారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందడం, అంతర్జాతీయ వేదికపై మన రాష్ట్ర ఘనతను చాటిచెప్పడం తెలంగాణకు గర్వకారణమని కొనియాడారు.

సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల పథకాల రూపకల్పన పై అంతర్జాతీయ వేదికపై కవిత వివరించనున్నారు. గత పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీని ఆకర్షించాయి. తెలంగాణలో వ్యవసాయం, విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటీ తదితర అంశాలపై కవిత ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతులకు రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు అంశాలపై కవిత ప్రసంగిస్తారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీఛార్జ్ అయ్యేలా కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడం, రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే మిగులు విద్యుత్తుకు చేరుకోవడానికి సీఎం కేసీఆర్ చేసిన కృషితో పాటు మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీళ్లును సరఫరా చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మత్తు చేయడం వంటి వివరాలను వివరించనున్నారు. వైద్య, విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై కూడా యూనివర్సిటీలో కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు. హైదరాబాద్ పట్టణ అభివృద్ధి, భద్రత, మౌలిక సదుపాయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News