వరి ధాన్యం కోనుగోలులో తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయ్యాలని
భారతీయ కిసాన్ సంఘ్ అధ్వర్యంలో తహసిల్దార్ వీర్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను తప్ప, తాలు పేరుతో దోపిడీ అరికట్టాలిన్నారు. కాంట జరిగిన వెంటనే రైతుకు తక్ పట్టి ఇవ్వాలని ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం కొనుగోలు జరపాలని రైతులు కోరారు. రైతుల శ్రమను దోచుకోకండని, రైతుల కష్టాన్ని గుర్తించండని రైతులు అన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షుడు కళ్లెం మహిపాల్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కాసరం భూమరెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ క్యాతం మల్లారెడ్డి తిప్పిరెడ్డి అంజిరెడ్డి, గడ్డం సత్యనారాయణ, పన్నాల నారాయణరెడ్డి, ఉప్పులుటి రమేష్, నల్ల అమరేందర్ రెడ్డి, నోముల రాజేందర్, గడ్డం సోమరెడ్డి, మిట్టపల్లి జీవన్ రెడ్డి, మరిపెళ్లి మల్లయ్య తదితరులు రైతులు పాల్గొన్నారు.