Sunday, October 6, 2024
HomeతెలంగాణHyd: బీఆర్ఎస్ లో చేరిన నాగం, విష్ణు

Hyd: బీఆర్ఎస్ లో చేరిన నాగం, విష్ణు

హింసాత్మక చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించం

సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ నేత రాంపుల్లా రెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్ రెడ్డి తదితర నేతలు. వీరందరికీ గులాబీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్.

- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు @ తెలంగాణ భవన్
….పార్టీలో చేరిన మిత్రులందరికీస్వాగతం
…నాగం జనార్దన్ రెడ్డి 1969 తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు ..ఆ తర్వాత ఉద్యమంలో పాల్గొన్నారు…జైలుకు వెళ్లిన చరిత్ర నాగంది
…నాగం చేరికతో బలం పెరిగింది
…పాలమూరులో పద్నాలుగుకు పద్నాలుగు సీట్లు గెలవడం ఖాయం అయ్యింది
…విష్ణువర్ధన్ రెడ్డి మంచి రాజకీయ భవిష్యత్ కు నాది భాద్యత
…పీజేఆర్ నాకు మంచి మిత్రుడు ..ఆయన కుమారుడు విష్ణు నా కుటుంబ సభ్యుడి లాంటి వాడే


…ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ,విష్ణు పాత కొత్త అనే తేడా లేకుండా సమన్వయం తో పని చేసుకోవాలి
…నాగం ఇంటికి త్వరలో నేనే స్వయంగా వెళ్లి మరోసారి ఆయన వెంట వచ్చిన కార్యకర్తలను కలుసుకుంటా
…తెలంగాణ బ్రహ్మాండమైన పురోగతి తో ముందుకు సాగుతోంది


..తలసరి ఆదాయం పెరిగింది ..24 గంటల కరెంటు దేశం లో మరెక్కడా లేదు
…అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి
…నిన్న ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి ని చంపాలని చూశారు
…దేవుడి దయ వల్ల ప్రభాకర్ రెడ్డి బ్రతికి బయట పడ్డాడు
…ఇలాంటి హత్య రాజకీయాలు సహించేది లేదు

…హింసాత్మక చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించం

…ప్రతీప శక్తులు యెన్నో ఉంటాయి

…హేయమైన దాడులకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పుదాం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News