ఒలింపిక్స్ కు మనదేశం ఎప్పుడు ఆతిథ్యం ఇస్తుందన్న బేతాళ ప్రశ్నకు సమాధానం దొరికే రోజులు వచ్చినట్టున్నాయి. పలు ఇంటర్నేషనల్, ప్రెస్టీజియస్ ఈవెంట్స్ ను హోస్ట్ చేయటాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న మోడీ సర్కారు ఈమేరకు 2036లో జరగబోయే ఒలింపిక్స్ కు బిడ్ వేస్తామంటోంది. గుజరాత్ లో ఒలింపిక్ ఈవెంట్స్ జరిపేందుకు అవసరమైన ఇన్ఫ్రా అంతా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించటం క్రీడాప్రియులకు గుడ్ న్యూస్ గా మారింది. గతంలోనే ఏషియన్ గేమ్స్, కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించిన భారత్, త్వరలో జీ-20 భేటీకి ఆతిథ్యం ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 2032 వరకూ ఒలింపిక్స్ నిర్వహించేందుకు స్లాట్స్ అన్నీ బుక్ అయిపోయిన నేపథ్యంలో 2036 తరువాత జరిగే ఒలింపిక్స్ కు వేదికగా భారత్ ను నిలబెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.