ఈ హెడ్ లైన్ షాకింగ్ గా ఉంది కదా.. కానీ ఏం చేద్దాం ఇది నిజం. మనం నమ్మితీరాల్సిన, అత్యవసరమైన నిజం. గ్లోబల్ గా వృథాగో పోతున్న ఆహారాన్ని అంచనా వేస్తే కళ్లు బైర్లు కమ్మే ఇలాంటి నంబర్లే వెలుగులోకి వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల్లో ఏకంగా మూడవ వంతు వృథాగా పోతోంది. ఓవైపు ఆకలి చావులను మనం నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఉన్నట్టు చదువుతాం, చూస్తాం కానీ ఆహార వృథాను మాత్రం మనం కంట్రోల్ చేసుకోలేక పోతున్నాం.
ప్రపంచంలో అందరి పొట్టలు నింపేంత ఆహారం ఉత్పత్తి అవుతున్నా అది అందరికీ అందక వృథాగా కుళ్లిపోతోంది. United Nations Environment Programme (UNEPs) Food waste Index Report 2021 తేల్చినది ఇదే. పూర్ ఫుడ్ మేనేజ్మెంట్ దీనికి కారణమని ఐక్యరాజ్యసమితి లెక్కలు స్పష్టంచేస్తున్నాయి. ప్రపంచంలో అన్నమో రామచంద్రా అంటూ విలవిలలాడుతున్న వారు 811 మిలియన్ల మంది ఉన్నారు.
ఇలా అత్యధికంగా ఆహార వృథాను చేస్తున్న టాప్ 5 దేశాల్లో అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, ఆతరువాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి. కెనడా, ఐర్లాండ్ లోనూ ఇదే పరిస్థితి. అందుకే అన్నం పరబ్రహ్మం అంటారని ఇప్పటికైనా మీకు మన పెద్దల మాట గుర్తుకు వచ్చినట్టుంది.