కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ కోసం ఆరు దశాబ్దాలు పనిచేసినా గుర్తింపు లేకపోవడం బాధాకరం ఉందని, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీరుతో మనస్తాపానికి గురైన అయన పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేజేఆర్ మాట్లాడుతూ కంటోన్మెంట్ లోని కేజేఆర్ గార్డెన్స్ లో జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గాంధీ భవన్ టికెట్ల అమ్మకానికి అడ్డగా మారిందని ఆరోపించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సీనియర్లకు గౌరవం ఇవ్వడంలేదన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా బయట వ్యక్తులకు టికెట్లను కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తాజా విధానాలు నచ్చకనే కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ జాతీయ కోశాధికారి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. కంటోన్మెంట్ తోపాటు సమీప ప్రాంత బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి తన వంతు సహకారం అందిస్తానని జనార్దన్ రెడ్డి అన్నారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి స్వయాన బావ, కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్ర సేవాదళ్ విభాగం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ కార్యక్రమంలో కనుకుల పద్మారెడ్డి, కనుకుల అక్షిత్ రెడ్డి, మాడ సిద్దిరాంరెడ్డి, సింగిరెడ్డి యుగేంధర్ రెడ్డి, నర్సింహారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సదానంద్ రెడ్డి,నరేందర్ రెడ్డి, నవాబ్ రెడ్డి, సురేష్, దినేష్, మీర్జాలతీఫ్, మోహన్ రావు పాల్గొన్నారు.