హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.
హుజురాబాద్ లోని మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి నివాసంలో సాయంత్రం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాన్ని రచించారు. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలను అప్రమత్తంగా ఉంచాలని, ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లతో మమేకమై, మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేయాలని వినోద్ కుమార్ సూచించారు.
క్రమశిక్షణ కలిగిన బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులుగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని వినోద్ కుమార్ అన్నారు. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తిప్పి కొట్టాలని, ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వద్దని వినోద్ కుమార్ పేర్కొన్నారు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో హుజురాబాద్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ముఖ్య నాయకులు వర్ధినేని రవీందర్ రావు, పొనుగంటి మల్లయ్య, వడ్లూరి విజయ్ కుమార్, కొలిపాక శ్రీనివాస్, కిషన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Huzurabad Sketch: బీఆర్ఎస్ హుజురాబాద్ స్కెచ్ ఇదే
కౌశిక్ రెడ్డి కోసం వ్యూహం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES