Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Karimnagar: చొప్పదండిని అద్దంలా మెరిపిస్తా

Karimnagar: చొప్పదండిని అద్దంలా మెరిపిస్తా

వాడవాడలా సుంకే రవిశంకర్ కు బ్రహ్మరథం

మళ్ళీ గెలిపిస్తే చొప్పదండిని మరింత అద్దంలా మెరిసేలా చేస్తానన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. 70 సంవత్సరాలలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా చొప్పదండి పట్టణాన్ని తాను అభివృద్ధి చేసినట్టు ఆయన సగర్వంగా ఓటర్లకు వివరించారు. చొప్పదండి మున్సిపాలిటీ 1వ,2వ,3వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాట్లాడుతూ..

మున్సిపల్ ఎన్నికల్లో 20కోట్లతో అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చిన 120కోట్లతో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ, రోడ్డు, సిసిరోడ్లు, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కారుచీకట్లే అని, బీజేపీకి ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు వెనుకకు పోతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు. మళ్లీ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News