సైదాపూర్ మండలంలోని బొమ్మకల్, అమ్మనగుర్తి గ్రామాల్లో ప్రచార కార్యక్రమంలో హుషారుగా పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకముందన్నారు పొన్నం. హుస్నాబాద్ ప్రస్తుత శాసనసభ్యులు సమర్థుడైతే 1800 ఓట్లు ఉన్న అమ్మన గుర్తి గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్రూంలు కట్టించినాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సమర్థుడైన నన్ను హుస్నాబాద్ నియోజకవర్గం నుండి శాసన సభ్యుడిగా గెలిపించి శాసనసభకు పంపితే నియోజకవర్గం అభివృద్ధి చేస్తా, ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం, గ్యారెంటీ కార్డును రేషన్ కార్డు లాగా భద్రంగా ఉంచుకోండన్నారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపించండి పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు గ్రామాల్లో ఉన్న కారోబార్, పారిశుద్ధ కార్మికుల సమస్యలు, రాబోయే కాలంలో గ్రామాల అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్రణాళిక తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు, మడమ తిప్పదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పెట్టి అమలు చేశాం. కాంగ్రెస్ హయాంలో ఆపద వస్తే 108 వాహనం కుయ్ కుయ్ మంటూ వచ్చేది, ఈరోజు ఆ పరిస్థితి ఉందా? 30 రోజులు నా కోసం కష్టపడండి, ఐదు సంవత్సరాలు మీకు సేవకుడిగా ఉంటానన్నారు.
నన్ను కలవాలంటే హుస్నాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు ఇల్లు తీసుకున్న, నేరుగా మీరు ఎవరైనా వచ్చి నన్ను కలవచ్చు, మధ్యలో ఎవరితోనూ మీకు ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు.