అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగాపురం ఇందిర అన్నారు. జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తిమ్మాపురం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు వార్డ్ మెంబర్లు గొలుసుల సుధా రాజు, గోనె హరిత హరికృష్ణ, పులి నవ్య రాజు, గ్రామశాఖ ఉపాధ్యక్షు డు పులి శోభన్, మండల బిఆర్ఎస్వి అధ్యక్షులు కోడిమాల సురేష్ రాధిక, గ్రామశాఖ మాజీ అధ్యక్షులు ఎర్ర రాజు శోభ, పులి సుమన్ గాదరి సదయ్య, పులి నరసయ్య కొమురయ్య, గాదరి జానీ రాములు, సదను చింటూ నరసయ్య, యాదయ్య, నరేష్ సోమయ్య,పెంటయ్య నరసయ్య అశోక్ కోడిమాల శేకర్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గోనె వెంకన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర మండలంలోని తిమ్మాపురం గ్రామంలో గడప గడపకు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6 గ్యారెంటీ పథకాలను వివరించారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆమె పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ..బిఆర్ఎస్ ప్రభుత్వం 9ఏండ్ల పాలనలో నియోజక వర్గ అభివృద్ది ఏ మాత్రం జరగలేదని అన్నారు.స్టేషన్ ఘనపూర్ ప్రజలే నాకు రాజకీయ బిక్ష పెట్టారని గొప్పలు చెప్పుకుంటున్న కడియం శ్రీహరి తన 30ఏండ్ల రాజకీయ చరిత్రలో
ఉమ్మడి ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ఎంపిగా, ఎమ్మెల్సీగా ఉన్నత పదవులు పొంది నియోజక వర్గాన్ని ఏమాత్రం అభివృద్ది చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వండి అభివృద్ది చేసి చూపిస్తామని అన్నారు.