Saturday, November 23, 2024
HomeతెలంగాణVanaparthi: ప్రచారంలో మంత్రిగారి సతీమణి

Vanaparthi: ప్రచారంలో మంత్రిగారి సతీమణి

ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ అభ్యర్థే

BRS కార్యకర్తలను పార్టీ ఎల్లప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ అండగా నిలుస్తుందని పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ అభ్యర్థేనని మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి అన్నారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని కన్మనూర్ గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి ఇంటింటి ప్రచార కార్యక్రమాని నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమె గ్రామ ప్రజలతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ మొదలుకొని పండు ముసలి వరకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోని తెలంగాణని ఆమె వివరించారు.

నియోజకవర్గ పరిధిలో మంత్రి నిరంజన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి పనులు చేసి ముందుకు సాగుతున్నారని అలాంటి అభివృద్ధి నాయకుడికి ప్రజలందరూ మద్దతు తెలుపుతూ భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు. ఆమె వెంట వనపర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూర్యవశం గిరి, స్థానిక నాయకులు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News