Saturday, November 23, 2024
HomeతెలంగాణPadi Kaushik: మా ఇంట్లో కాదు ఎప్పుడూ మీతోనే: కౌశిక్ భార్య

Padi Kaushik: మా ఇంట్లో కాదు ఎప్పుడూ మీతోనే: కౌశిక్ భార్య

వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసి చూపిస్తా

ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే కెసిఆర్ ని ఒప్పించి, 1000 కోట్లు తెచ్చి హుజురాబాద్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్సీ హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి, మాచనపల్లి, ఆబాది జమ్మికుంటలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 19 వేల కోట్ల రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడని అన్నారు.

- Advertisement -

రైతుల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి వారి ఎదుగుదలకు కారణమయ్యాడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి ప్రజల మనసు గెలుసుకున్నాడని అన్నారు. ఐదు గంటల కరెంటు ఇస్తానని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా 24 గంటల కరెంటు ఇస్తున్న కెసిఆర్ ప్రభుత్వం కావాలా తేల్చుకోవాలని ప్రజలను కోరారు. ఇప్పుడు కూడా పేద ప్రజల కోసం కెసిఆర్ కొత్త మేనిఫెస్టో తయారు చేశారని అన్నారు. ముఖ్యంగా మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయల పెన్షన్ ఇవ్వనున్నమని, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ ధీమా కేసీఆర్ బీమా అనే పథకం ద్వారా కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం కూడా అందించనున్నామన్నారు.

రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి సన్న బియ్యం కూడా అందించనున్నామని, మహిళలకు 400కే గ్యాస్ సిలిండర్ ని కూడా అందించేందుకు పథకాన్ని సిద్ధం చేశామన్నారు. ఆరోగ్య శ్రీని కూడా ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచామన్నారు. పేదల కోసమే ప్రవేశపెట్టిన కొత్త మేనిఫెస్టో పేదలందరికీ రక్షణ కవచంగా ఉంటుందన్నారు. గడచిన 8 సంవత్సరాల నుంచి ప్రజల కోసమే అహర్నిశలు కష్టపడే ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పూర్తిస్థాయిలో సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

✳️మా ఇంట్లో కంటే ఎక్కువ మీతోనే ఉంటున్నాడు…
ఒక్క అవకాశం ఇవ్వండి…
కౌశిక్ రెడ్డి సతీమణి షాలిని రెడ్డి….
హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి గత 15 ఏళ్లుగా ఇంట్లో ఉండడం కంటే ఎక్కువ మీతోనే ఉంటున్నాడని హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి అన్నారు. గురువారం జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. మీ ఇంటి ఆడపడుచు గా కోరుతున్న కౌశిక్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ఉండి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని అభివృద్ధి పనులన్నీ చేపించే బాధ్యత తీసుకుంటామన్నారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, కే డీ సి సి వైస్ చైర్మన్ పింగళి రమేష్, ఎంపీపీ దొడ్డే మమతా ప్రసాద్, జడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
✳️ట్రాక్టర్లో ప్రచారం చేస్తూ సందడి చేసిన కౌశిక్ రెడ్డి…
హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలం రంగమ్మపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ, హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తనను కలిసేందుకు రంగమ్మపల్లి గ్రామ ప్రజలతో ట్రాక్టర్ మీద ప్రచారం చేస్తూ సందడి చేశారు. ట్రాక్టర్లో ఉన్న మహిళలు కౌశిక్ రెడ్డి తో సెల్ఫీలు దిగారు. ట్రాక్టర్ ముందు యువకులు ద్విచక్ర వాహనాలతో కౌశిక్ అన్నకు జై అంటూ నినాదాలు చేశారు. గ్రామాలలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతుండడంతో ఎక్కడ చూసినా జన సంద్రోహమే కనిపించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News