Thursday, April 10, 2025
HomeఆటGreesham with CM: స్కేటింగ్ ఛాంపియన్ గ్రీష్మ‌కు సీఎం జగన్ అభినంద‌న‌

Greesham with CM: స్కేటింగ్ ఛాంపియన్ గ్రీష్మ‌కు సీఎం జగన్ అభినంద‌న‌

శెభాష్ తల్లీ అంటూ తల నిమిరిన సీఎం

స్కేటింగ్ క్రీడాకారిణి, ఆసియన్ క్రీడ‌ల విజేత గ్రీష్మ దొంత‌ర‌ను రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు. ఆమె ఆట తీరును, సాధించిన విజ‌యాల‌ను, ప్ర‌తిభ‌ను ప్ర‌శంసించారు. స్కేటింగ్ విభాగంలో త‌ను సాధించిన విజ‌యాల గురించి వివ‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ స్థాయిల్లో 105 మెడ‌ల్స్ సాధించానని, ఇటీవ‌ల చైనాలో జ‌రిగిన 19వ ఆసియ‌న్ క్రీడల్లో భాగ‌స్వామ్యం అయ్యాన‌ని మూడు ప‌త‌కాలు సాధించి 16వ స్థానంలో నిలిచాన‌ని పేర్కొంది. త‌ను సాధించిన మెడ‌ళ్ల‌ను ముఖ్య‌మంత్రికి చూపించి మురిసిపోయింది. గ్రీష్మ‌ విజ‌యాల గురించి తెలుసుకున్న ముఖ్య‌మంత్రి శెభాష్ త‌ల్లీ అంటూ చిరున‌వ్వుతో త‌ల‌పై నెమ‌రుతూ, జీవితంలో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆశీర్వాదం అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News