Friday, September 20, 2024
HomeతెలంగాణDasyam Vinay: మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లండి

Dasyam Vinay: మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లండి

గెలుపుపై ధీమాగా ఉన్న దాన్యం

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 11,29 డివిజన్ లలో ఇంటింటి ప్రచారం చేశారు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక నగరం హనుమకొండలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి పనులు కూడా చేపట్టామని అన్నారు. ఐదువేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేశానని, ఆపద కాలంలో ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళ కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తయారుచేసిన మేనిఫెస్టో ( కెసిఆర్ భరోసా) ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గతంలో కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలే కాకుండా మేనిఫెస్టోలో లేనటువంటి పథకాలు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టి వాటిని సంపూర్ణంగా అందించినటువంటి ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు.

- Advertisement -

150, 11వ డివిజన్ నుండి 100, మొత్తం 250 మంది బిజెపి, కాంగ్రెస్, సిపిఎం నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ నాయకత్వంలో పనిచేస్తామని బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, డివిజన్ ఇంచార్జ్ నార్లగిరి రమేష్, 11వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, 29వ డివిజన్ అధ్యక్షులు సదాంత్, ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రసాద్, 11వ డివిజన్ నాయకులు పరశురాములు, కేయూబిఆర్ఎస్వి అధ్యక్షులు బైరపాక ప్రశాంత్, గన్నారపు కమల్, దీపు, అయేషా ఫాతిమా, విద్య, నాగరాజు, సుకుమార్, దేవి, వాసు, వివేక్, నిరంజన్, రమేష్, తాళ్లపల్లి రమేష్, వాడుక నాగరాజ్, రాచర్ల రాము, గట్టు చందు, రుద్ర శ్రీనివాస్, పూజారి కుమారస్వామి, మాము నూరి రాజు, మాల్వ రాజు, ఇజ్జగిరి భీమరాజ్, ములుగు నక్క జ్యోతి, ప్రశాంత్, మంద చంటి, మైదాన్ కరుణాకర్, గొర్రె అరుణ్, మిద్దపాక ఆనంద్, రితిక రాజ్ కుమార్, బీస్ పాక వరుణ్, బిసిపాక శివ, మాదాసు ఎలీషా, రామకృష్ణ, కృష్ణవేణి కొడకండ్ల సరిత, తహసీన్, వర్షం వనిత,రమ్య,అడుప విజయ్, స్వప్న, స్వాతి తో పాటు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News