తెలంగాణ రాక ముందు మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి పల్లె కరువుతో కుమిలి పోయేదని ఎటు చుసినా ఎండిన పంటలు దర్శనం ఇచ్చేవని తెలంగాణ వచ్చాక గ్రామాలు ఎటు చూసిన పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నాయని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్వాడ మండలం ఆత్యకుంట తండాకు వచ్చిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. నాడు పింఛన్లు కాంగ్రెస్ పాలనలో రూ. 200 ఉంటే ఇప్పుడు రూ. 2016 అయ్యాయని త్వరలో రూ.5016 అవుతాయాని ప్రజలకు తెలిపారు.3 గంటల కరెంటు చాలని అన్న కాంగ్రెసోళ్లను ఓట్ల కోసం వస్తే తరిమికొట్టాలని తెలిపారు.
ఎవుసం బాగుండాలంటే మళ్లీ బీఆర్ఎస్ సర్కారే రావాలని సూచించారు. ఈ ప్రచారంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల రమణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ లక్ష్మయ్య, ముడా డైరెక్టర్ బాలయ్య, మాజీ ఎంపీపీ శేఖర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణయ్య గౌడ్, పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యుడు మన్నన్, గౌడ సంఘం జాతీయ నాయకుడు వట్టికూటి రామారావు, సర్పంచ్ సుగుణ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.