Saturday, October 5, 2024
Homeనేషనల్Tamil Nadu: అక్కడున్నదంతా అంటరానితనం, రెండు గ్లాసుల సిస్టం..తాగు నీళ్లు కావవి సీవేజ్ వేస్ట్

Tamil Nadu: అక్కడున్నదంతా అంటరానితనం, రెండు గ్లాసుల సిస్టం..తాగు నీళ్లు కావవి సీవేజ్ వేస్ట్

ఆ ఊళ్లో ఉన్నంట్టుండి అందరూ అస్వస్థతకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు విపరీతంగా అనారోగ్యం పాలై, రోగిష్టులుగా మారుతున్నారు. కలుషితమైన తాగునీరే దీనికంతా కారణమని డాక్టర్స్ తేల్చారు. అప్పుడు అసలు తాము తాగే నీళ్లలో ఏముందని చూస్తే పచ్చని నీరంతా మల మూత్రాదులతో నిండిపోయి కనిపించింది. ఈ తతంగంతో అసలు విషయం వెలుగులోకి వచ్చి అందరికీ షాక్ ఇస్తోంది.

- Advertisement -

తమిళనాడులోని పుదుక్కోటై జిల్లాలోని ఇరయూర్ అనే గ్రామంలో ఇప్పటికీ రెండు గ్లాసుల విధానం, అంటరానితనం ఉండటం స్థానికంగా ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రజల పాలిట శాపంగా మారి ఇలా ప్రాణాల మీదకు తెస్తోంది. స్థానిక టీ షాపుకు వెళ్తే ఎస్సీలు తాగేందుకు వేరే గ్లాసును మాత్రమే అనుమతిస్తారనే విషయాన్ని ప్రత్యక్షంగా చూసిన అధికారులు షాక్ అయ్యారు. అంతేకాదు ఇక్కడి దళితులకు గుడిలో కాలు పెట్టేందుకు గ్రామస్థులు అస్సలు అనుమతించరు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలపై పుదుక్కోటై జిల్లా కలెక్టర్ ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపిస్తుండగా, బీజేపీ కూడా ఓ బృందంతో లోగుట్టును లాగే ప్రయత్నంలో ఉంది.

ఇరయూర్ లో కనీసం 100 మంది దళితులు నివసిస్తుండగా వాళ్లు నీళ్లు తాగే బావిలోకి మానవ వ్యర్థాలను పంపుతూ గ్రామస్థులు వివక్ష చూపుతుండటం అమానవీయంగా మారింది. దీని వెనకున్న వ్యక్తులు ఎవరని తెలియరాలేదు. గత మూడు తరాలుగా తాము గ్రామంలోని గుడిలోకి అడుగు పెట్టి ఎరగమని ఎస్సీలు చెబుతుండటం అధికారులను కలిచివేసింది. దీంతో దళితులను ఆలయ ప్రవేశం చేయించిన అధికారులు గ్రామంలో అంటరానితనానికి చరమగీతం పాడతామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News