Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్KCR @ Konaipalli: నామినేషన్ పేపర్స్ కు కోనాయిపల్లిలో కేసీఆర్ పూజలు

KCR @ Konaipalli: నామినేషన్ పేపర్స్ కు కోనాయిపల్లిలో కేసీఆర్ పూజలు

1985 నుంచి కేసీఆర్ కు ఈ సెంటిమెంట్

సిద్ధిపేట జిల్లా కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొంది, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్. కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్‌.. స్వామి వారి పాదాల ముందు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు నామినేషన్ పత్రాలు పెట్టి పూజలు చేశారు. ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ వేయనున్న సీఎం కేసీఆర్ 1985 నుంచి ఇక్కడ పూజలు చేశాకే నామినేషన్ దాఖలు చేయటాన్ని సెంటిమెంట్గా భావిస్తూ, విజయబావుటా ఎగురవేస్తున్నారు.

- Advertisement -

తనకిష్టదైవమైన కోనాయపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ (విజయ) పత్రాలు ఉంచి పూజలు చేశారు. కోనాయపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లిన సీఎం కేసీఆర్ కి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని ఆలయంలోకి సీఎం ప్రవేశించారు. నామినేషన్ పత్రాలను ఆలయ అర్చకులకు అందించగా మూలవిరాట్టు వద్ద పత్రాలు ఉంచి సీఎం కేసీఆర్ గారి గోత్ర నామాలు, సంకల్పంతో పూజలు నిర్వహించారు.

అర్చకులు కేసీఆర్ గారి చేతికి కంకణధారణ చేసి తీర్థ ప్రసాదాలు అందించి వేదాశిర్వచణం అందించారు. అనంతరం ఆలయ ఆవరణలోనే వేంకటేశ్వర స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు.

పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయం నుండి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి మహిళలు విజయ తిలకం దిద్దారు. కేసీఆర్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ హర్షధ్వానాలు చేశారు. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ విజయం తథ్యం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అత్యంత అభిమానంతో గులాబీల వర్షం కురిపించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు, ఎంపీలు..జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బిఆర్ఎస్ నేత శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రధాన ముఖద్వారం దక్షిణం వైపు ఉండడం ఇక్కడి కొనాయిపల్లి దేవాలయం ప్రత్యేకత.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News