శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల మండలం దేవరంపల్లి ఖానాపూర్ ఘనపూర్ నాన్చేరి ఇంద్రారెడ్డి నగర్ అంతారం నౌలాయపల్లి హస్తిపూర్ ఎంకన్న గూడ కౌకుంట్ల గ్రామాలలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీమ్ భరత్ మాట్లాడుతూ… 9 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ ప్రాంతానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 111 జీవో తాగునీరు సాగునీరు నీళ్లు నిధులు నియామకాలు డబుల్ బెడ్ రూమ్ లు దళితులకు మూడెకరాల భూమి కేజీ టు పీజీ విద్య దళిత ముఖ్యమంత్రి ఎక్కడ అని ప్రశ్నించారు. విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఓ కుటుంబం పాలైంది అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలు తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ, చేవెళ్ల సర్పంచ్ శైలజ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, గుడి మీద పిఎసిఎస్ చైర్మన్ గోనె ప్రతాపరెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి యాలాల మహేశ్వర్ రెడ్డి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, డిసిసి ఉపాధ్యక్షుడు మండల మహిళా అధ్యక్షురాలు దేవర సమత వెంకటరెడ్డి, మహిళా ప్రధాన కార్యదర్శి గోనే సరిత ప్రతాపరెడ్డి, మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, ఓబిసి మండల అధ్యక్షులు సూర్యాపేట శ్రీనివాస్ గౌడ్, ఎంపిటిసి గుండాల రాములు, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు మధుసూదన్ గుప్తా, చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, పాటి దామోదర్ రెడ్డి, పెంటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్, మల్లేష్ శేఖర్ రెడ్డి, కావలి వెంకటేష్ బాబు, గణపురం తరుణ్ రవీందర్ రెడ్డి, దుర్గాప్రసాద్, మద్దిల శ్రీనివాస్, సుశాంత్, బేకరీ రాములు, శ్రీనివాస్, ప్రవీణ్ రాములు, యాదయ్య, వెంకటరెడ్డి, మాణిక్యం, మాల దేవేందర్, సత్తయ్య, రాము, నజీర్, మల్లేష్, రామస్వామి, నవీన్, కృష్ణ గౌడ్, మల్లారెడ్డి, వివిధ గ్రామాల ప్రజలు నాయకులు పాల్గొన్నారు.