Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Kadiyam: నాకు వ్యక్తిగత ఎజెండా లేదు

Kadiyam: నాకు వ్యక్తిగత ఎజెండా లేదు

ఎట్లయిన గెలుస్తమని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నయి

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం వేలేరు మండలంలోని షోడాషపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ, జనగామ బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాసంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్గమో, కడియం వర్గమో, రాజయ్య వర్గమో, మరో వర్గమో లేదు మనమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వర్గమే. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయమే మనందరికీ శిరోధార్యం. నాయకులు, కార్యకర్తలంతా పార్టీ అభివృద్ధి కోసం,సైనికుల్లా ఐక్యమత్యంతో పని చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని రెండు పర్యాయాలు ఆశీర్వదించారు. తొమ్మిదిన్నరేళ్లలో ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే ఆదరించండి. అసత్యాలు, అబద్ధాలు మాత్రమే ప్రతిపక్షాల ఆయుధాలు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆయుధాలు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో జరగుతున్న అభివృద్ధిని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓర్చుకోవడం లేదు. ప్రజలను మభ్య పెట్టి, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఆరు గ్యారంటీలు పథకాలు ఇస్తామని అసత్యపు, అమలు కాని హామీలు ఇస్తోంది. అభివృద్ధి ఎవరు చేశారో కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ కార్యకర్తలు కష్టపడాలని, వారికి అన్నివేళలా తోడుగా ఉంటాను. వేలేరు నూతన మండలం అయితే ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారని భావించి సీఎం కెసిఆర్ ఆశీస్సులతో నూతన మండలం తెచ్చుకున్నాం. గతంలో రూ.11 కోట్లతో మూడు గ్రామాలకు సాగునిరు అందించుకున్నాం. రూ.103 కోట్లతో మూడు సాగునీటి ప్రాజెక్టును ప్రారంభించుకున్నాం. రూ.35 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మా ణం, వేలేరు మండలంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు ఏర్పాటు. హన్మకొండ జిల్లా కేంద్రానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేలేరు మండలానికి ఉమ్మడి రాష్ట్రంలో సరైన రోడ్డు కూడా లేని దుస్థితి. హన్మకొండ జిల్లాలో ఒక మంచి మండలంగా పేరు తెచ్చుకున్నాం. గత ఎన్నికల్లో 2014లో ఎంపీగా, 2015లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా, 2021 లో ఎమ్మెల్సీ గ్ర్యాడ్యుయేట్ గా ప్రజలకు అనేక సేవలందించా. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రైతు బంధు సమితి చైర్మన్ గా ప్రత్యక్ష్యంగానే సేవ చేస్తున్న నన్ను ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో ఆదరించారు. 2014లో 2018లో ఆదరించారు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ముచ్చటగా మూడోసారి ఎగురవేయాలి. 2023 మూడోసారి బీఆర్ఎస్ ను ఖచ్చితంగా గెలిపిద్దాం.

మూడోసారి ఎట్లయిన గెలుస్తమని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నయి. ప్రభుత్వ పథకాలను తప్పుదోవ పట్టిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలె. నియోజకవర్గానికి ప్రత్యేక సేవాలందించారు. కడియం శ్రీహరి నియోజకవర్గానికి ప్రత్యేక సేవాలాం దించారు..అందుకే సీఎం నమ్మకంతో కడియం శ్రీహరి కి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించాడు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. కష్టపడి స్టేషన్ ఘనపూర్ అభ్యర్థి కడియం శ్రీహరిని భారీ మెజారిటీ తో గెలిపించేందుకు కృషి చేయాలి. ఘన్ పూర్ గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేద్దాం. తెలంగాణలో మూడోసారి మన ప్రభుత్వం రావడం ఖాయం. కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే అభివృద్ధితో పోటీపడండి.. కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేయాలి. అప్పుడే పార్టీతో మనకు తప్పక గుర్తింపు ఉంటుంది. నియోజకవర్గానికి కడియం శ్రీహరి అందరికి అందుబాటులో ఉండి సేవకుడిగా పనిచేస్తారు. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. నియోజవర్గంలోని అన్ని మండలాలను, గ్రామాలను ప్రత్యేక ప్రణాళికతో సమగ్రంగా అబివృద్ది చేస్తా. అనంతరం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బి.అర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కడియం శ్రీహరి మాట్లాడుతూ అనేక మంత్రి పదవులు చేపట్టి, ఉమ్మడి రాష్ట్రంలో నాకంటూ గుర్తింపు తీసుకొచ్చిన స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే నాలక్ష్యం. నిత్యం మీకు అందుబాటులో ఉంటూ మీ కష్ట సుఖాలలో పాలుపంచుకుంటానన్నారు. నాకు వ్యక్తిగత ఏజెండా ఏమీ లేదు నియోజకవర్గ అభివృద్ధి నా ఎజెండా అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా సీఎం కేసీఆర్ సహకారంతో గ్రామాలను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో యం.ఎల్.ఎ డా. తాటికొండ రాజయ్య, యం.ఎల్.సి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు, జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎడవెళ్లి క్రిష్ణా రెడ్డి, జనగామ గ్రంధాలయ సంస్థ చైర్మన్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News