Friday, September 20, 2024
HomeదైవంDevaragattu: లోక కళ్యాణార్థం చిన్నారుల ప్రత్యేక పూజలు

Devaragattu: లోక కళ్యాణార్థం చిన్నారుల ప్రత్యేక పూజలు

పెద్ద ఎత్తున హాజరైన భక్తులు

సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ,లోక కళ్యాణార్ధం ఆదివారం దేవరగట్టులో కొలువైన శ్రీ మాళ మల్లేశ్వర స్వామి దేవాలయంలో చిన్నారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జాము నుండే ఆలయ పూజారులు జయ మల్లప్ప స్వామి, మల్లికార్జున స్వామిలు మల్లేశ్వరుడికి ప్రత్యేక పూజలైన జలాభిషేకం, రుద్రాభిషేకం, కుంకుమార్చన, బండారు, చందన అభిషేకంతో పాటు ఆకుపూజ నిర్వహించినట్లు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నారులు స్వామి వారికి నిర్వహించిన విశేష పూజలు భక్తుల మనసును భక్తి పరవశ్యంతో అలరింపజేసాయి. దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News