Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: నారీ శక్తి సమ్మేళనం

Nandyala: నారీ శక్తి సమ్మేళనం

ఆధునిక మహిళ శక్తి సామర్థ్యాలు గుర్తెరిగిన..

నంద్యాల పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో అఖిల భారతీయ మహిళా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నారీ శక్తి సమ్మేళనం నిర్వహించారు. భారతీయ మహిళ ఆది నుండి శక్తి రూపమే కానీ ఆమె ఏనాడూ అబల కాదని సహేతుకంగా తెలియజేస్తు ఈ సమ్మేళనాలను నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా డాక్టర్ సత్యసుందరి, డాక్టర్ స్వర్ణలత, న్యాయవాది విజయభారతి మాట్లాడుతూ భారతీయ మహిళ విధుషీమణి, వీరాంగన, ఉత్తమ గృహిణి, ఆమె మూలంగానే ఈ నాటికీ భారతీయ సంస్కృతి నిలిచిందని అన్నారు.

విదేశీయ దాడులు, వికృతాలు ఆమెకు వ్యక్తిగకంగా, సామాజికంగా ఎదగకుండా అణచివేసిందన్నారు. భారతదేశం ఆన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ముందంజ వేయాలని, అందులో మహిళలు మాతృమూర్తి, ప్రొఫెషనల్ గా, శాస్త్రవేత్తగా, సామాజిక కార్యకర్తగా విధులను పోషించడం చాలా అవసరం అన్నారు.

ఈ కార్యక్రమంలో మధుకుమారి, మురళి కళ్యాణి, శైలజ, సంధ్య, గాయత్రి, జ్యోతి చిలుకూరి, లీలావతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News