Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Peddakaduburu: ఎండిన రైతన్నల ఆశలు

Peddakaduburu: ఎండిన రైతన్నల ఆశలు

రబీ సాగుపై ఆశలు వదులుకున్న రైతులు

పెద్దకడబూరు మండలంలోని అప్పులను మూటగట్టుకొని కుంగిపోతున్న రైతన్నలు ఈ యేడాది వరుణుడు ముఖం చాటేయడంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వానదేవుడు కానరాకపోవడంతో సాగు అయిన అరకొర పంటలు ఎండుముఖం పడుతున్నాయి.దీంతో రైతులు మనో వేదనకు గురవుతున్నారు. ఇంతటి కరవు పరిస్థితులను తామెన్నడూ చూడలేదని రైతులు ఆదివారం ఒక ప్రకటనలో రైతన్నలు వాపోతున్నారు. ఈ సందర్భంగా రైతన్నలు తెలియజేస్తూ వర్షాలు పూర్తిగా కనుమరుగవడంతో బోరుబావుల్లో కూడా నీరు తగ్గిపోతుంది. దీంతో బోరుబావుల రైతులు కూడా గగ్గోలు పెడుతున్నారు. కరువు పరిస్థితుల కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు. తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే,, మండల కేంద్రమైన పెద్ద కడబూరు మండలంలోని కమ్మలదిన్నె, కల్లుకుంట,తదితర గ్రామాల్లో ఖరీఫ్, రబీ సీజన్ లో రైతుల పంటలు వర్షాలు లేకపోవడంతో తుదుచుకుపెట్టుకుని పోయాయి. ఖరీఫ్ లో అరకొరగా పంటలు సాగవ్వగా. వర్షాలు రాకపోవడంతో మొలకదశలోనే పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులు అప్పులపాలయ్యారు. రబీ, సీజన్లోనైనా పంటలను సాగు చేసుకుందామని నెల రోజులుగా ఎదురుచూస్తున్న రైతులకు చివరికి నిరాశే ఎదురయ్యింది. ఇప్పటికే ముందస్తుగా విత్తనం వేసుకున్న రైతులకు వర్షాలు పడితే పంటలు పండుతాయని నిత్యం మేఘం వైపు చూస్తూ వరుణుడి కరుణకోసం ఎదురు చూస్తున్నారు. ఇక పంటలను సాగుచేసుకునేందుకు సమయం లేదని మరికొంతమంది రైతులు రబీ సీజన్ పై పూర్తిస్థాయిలో ఆశలు వదులుకున్నారు. ఇంతటి కరువు పరిస్థితులను తామెన్నడూ చూడలని వాపోతున్నారు. పంటల సాగుకు, విత్తనాలకు రైతులు లక్షలాది

- Advertisement -

రూపాయలను అప్పులను చేసుకుని అప్పుల పాలయ్యారు. చేసిన అప్పులను తీర్చేందుకు రైతులు, వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు. అడుగంటిపోతున్న భూగర్భ జలాలు -బెంబేలెత్తిపోతున్న బోరుబావుల రైతులు : వర్షాఖాన లోటుతో జిల్లాలో భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు పేర్కొంటున్నారు. మెట్ట ప్రాంతంలో రబీలో పెద్ద ఎత్తున రైతులు వివిధ రకాల పంటలను సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు తగ్గిపోవడంతో వయవసాయ బోర్డు నుంచి నీరు సరిగా రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. రబీ సాగుపై మరింత ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల నుంచి మొక్కజొన్న, పొగాకు వంటి పంటలను రైతులు మెట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగు చేయనున్నారు. సాగునీరు అవసరం పడుతోంది. బోర్ల నుంచి నీరు సరిగా రాకపోతే. పంటలు దెబ్బతింటాయని అన్నదాత ఆందోళన చెందుతున్నారు. ఎక్కడిక్కడే చెరువులు అడుగంటడంతో ప్రత్యామ్నాయ పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ప్రభుత్వం అందుకు తగిన విధంగా ముందస్తు ప్రణాళిక రూపొందించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చెేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News