Friday, October 4, 2024
HomeతెలంగాణMoinabad: మీకు డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చాయా?

Moinabad: మీకు డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చాయా?

చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్

టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మోసపోయిన ప్రజలారా ఒకే ఒక సూటి ప్రశ్న మీకు మీరుగా ప్రశ్నించుకోండి.. కేసీఆర్ ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మీకు వచ్చాయా..? మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి మోసపోవద్దని టీపీసీసీ సభ్యులు షాబాద్ దర్శన్, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ అన్నారు. మొయినాబాద్ మండల పరిధిలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మాలి మాణయ్య ఆధ్వర్యంలో పెద్ద మంగళారం, మొయినాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగింది. కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు షాబాద్ దర్శన్, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ పాల్గొని ప్రసంగించారు. ముందుగా టిపిసి సభ్యులు షాబాద్ దర్శన్ మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఊరికి వెళ్లినా ప్రజలు కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం బలగం అలాంటిదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు నాయకులు అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భరత్ ను గెలిపించేందుకు కృషి చేయాలని షాబాద్ దర్శన్ పిలుపునిచ్చారు.

- Advertisement -

గత పది సంవత్సరాలుగా దగాపడ్డ తెలంగాణ ప్రజల పక్షాన నిలచి, వారి గొంతుకై మోసపూరిత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దర్శన్ అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని, దొరల పాలన నుంచి తెలంగాణను కాపాడుకుంటామని, ఇచ్చిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్పైనే ఉందన్నారు. అందుకు మీ పూర్తి మద్దతు అవసరమని అన్నారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్న బి ఆర్ ఎస్ పాలనకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, ప్రజలు టిఆర్ఎస్ మోసపూరిత వాగ్దానాలకు మరోసారి మోసపోవద్దని తెలుపునిచ్చారు. డబుల్ బెడ్ రూములు, ఇంటికో ఉద్యోగం, దళిత బంధు బీసీ బందు అంటూ సామాన్య ప్రజలను మోసం చేయడమే గాక కమిషన్లకు కక్కుర్తి పడి నాసిరకం ప్రాజెక్టులు కడుతూ ప్రజల నెత్తిన భారం మోపుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని అన్నారు. ఇకనైనా ప్రజలు అప్రమత్తమై టిఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలని భీమ్ భరత్ కోరారు.
రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుల ఆకాంక్షలకు, ఆత్మ గౌరవాన్నే తల మానికంగా భావించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే బాధ్యత ఇప్పుడు మీ చేతుల్లోనే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ తో గెలిచి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కాల యాదయ్య చేవెళ్ల ప్రజానీకంకు ఒరగబెట్టింది ఏమీ లేదని, చేవెళ్ల అభివృద్ధి కోసం కొట్లాడే గొంతుకనై మీ ఇంటి బిడ్డనై వస్తున్న ఒక సామాన్య వ్యక్తిగా మీ ముందు నిలబడ్డ నాకు మీ పూర్తి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాననీ, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి చేవెళ్ల అభివృద్ధికి మీ వంతు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మొయినాబాద్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News