Saturday, October 5, 2024
HomeతెలంగాణKTR @ Shadnagar: కడక్ నోటు కెసిఆర్, చిల్లర గాళ్లు కాంగ్రెస్, బిజెపి నాయకులు

KTR @ Shadnagar: కడక్ నోటు కెసిఆర్, చిల్లర గాళ్లు కాంగ్రెస్, బిజెపి నాయకులు

పిలిస్తే పలికే అంజన్నపై అలుగుడు ఎందుకు ?

తెలంగాణపై ప్రేమ లేని కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. వాళ్లు చిల్లరగాలని, వంద రూపాయల కడక్ నోటు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ముఖ్య కూడలిలో షాద్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నెల క్రితమే షాద్నగర్ పట్టడానికి వచ్చానని.. ప్రస్తుతం ఎమ్మెల్యే అంజన్న ఆదేశిస్తే మళ్ళీ రావడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో 17 మంది సీఎంలు గుంపులు గుంపులు వస్తున్నారని, కానీ తెలంగాణ సీఎం కెసిఆర్ మిమ్మల్ని నమ్మారని అన్నారు.
2014, 2019 ఒంటరిగానే వచ్చాము.. సింహం సింగిల్గానే వస్తుందని.. షేర్ ఖాన్ లు వస్తే రని.. అంజయ్య దమ్మెంది చూపిస్తరని స్పష్టం చేశారు.

- Advertisement -

నవంబర్ 30న మా సత్త ఏందో చూపించాలని పిలుపునిచ్చారు. ఇంతకు కాంగ్రెస్ కు తెలంగాణ పై ప్రేమ ఉందా.. ఉంటే 1971 లో ఎంపీ లను గెలిపిస్తే.. తెలంగాణ ఇవ్వకుండా చేసింది ఢిల్లీ దొరలు కాదా అని ప్రశ్నించారు. తొలి దశ ఉద్యమంలో కాంగ్రెస్పై పోరాటం చేశామని, మలిదశ ఉద్యమంలో ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కొంటున్నామని అన్నారు. ఎమ్మెల్యే అంజయ్య సాత్వికుడు, అంజన్న అంటే పిలిస్తే పలికే ప్రియనేస్తాలు అని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి పార్టీలో సమర్థులైన నాయకులు లేకపోవడం వల్ల పురుగు రాష్ట్రాలలో బయటికెళ్లి మందల్లా మొగోళ్లను తెచ్చుకుంటున్నారని, ఉన్నారు… గిసంటోళ్ల అవసరమా అని ప్రజలను ప్రశ్నించారు. కరెంటు, తాగునీర్, సాగునీర్, భూముల ధరలు, పేదల్లో ఆత్మష్టైర్యం నింపింది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని అన్నారు. ఎమ్మెల్యే అంజయ్య మళ్ళీ గెలిస్తే అయితే 5 వేల పెన్షన్ వస్తుందని, కెసిఆర్ మాట చెబితే మాట తప్పరని పేర్కొన్నారు. 93లక్షల కుటుంబాలకు భీమా కల్పించడంతోపాటు, పాఠశాలల్లో విద్యార్థులకు పొద్దున్న పూట బ్రేక్ ఫాస్ట్, ఇంటిటికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.

అలాగే 18 ఏళ్ళు నిండిన వారికి 3 వేల సౌబ్యాగ్య లక్ష్మి అందజేస్తామన్నారు. నల్ల ధనం ఏది మోదీ అంటే తెల్ల మొహం వేస్తున్నారని దుయ్యబట్టారు. 400 సిలిండర్ ను 1200 చేసిండని, ముఖ్యమంత్రి కేసీఆర్ మన మహిళలందరికీ 400కే సిలిండర్ అందజేస్తారని అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ కు నాలుగు మెడికల్ కాలేజీలు వస్తవని కలలోనైనా ఊహించామా అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. షాద్ నగర్ కు ఐ టీ హబ్ తెస్తామని,
గులుగినా.. అలిగినా గుద్దుడు గుడ్డుడేనన్నారు. ఎమ్మెల్యే అంజయ్య ఎంతో మంచి మనిషి అని, అంజయ్య పై అలుగుడు ఎందుకన్నారు. తెలంగాణలో గులాబీ జెండా ఉండగా ఇంకో జెండా మనకు అవసరమా చెప్పండి అని సందేహం వ్యక్తం చేశారు. ప్రతి తండాలో గిరిజన భవన్ నిర్మిస్తాం.. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటా 30 తారీఖున కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అంజన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News