Saturday, October 5, 2024
HomeతెలంగాణErrabelli @ IIT Ramayya: ఐఐటీ రామయ్యను పరామర్శించిన ఎర్రబెల్లి

Errabelli @ IIT Ramayya: ఐఐటీ రామయ్యను పరామర్శించిన ఎర్రబెల్లి

వయోభారంతో ఉన్న రామయ్య

మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను పరామర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త, పాలకుర్తి నియోజకవర్గం గూడూరుకు చెందిన, హైదరాబాద్ లో ఉంటున్న చుక్కా రామయ్యను వారి ఇంటికి వెళ్ళి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఆయనతో కొద్ది సేపు మాట్లాడి, ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్నారు. తాను పాలకుర్తి బిఅర్ఎస్పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు చెప్పారు. త్వరలోనే వచ్చి కలుస్తామని మాట ఇచ్చారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, గతంలోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చుక్కా రామయ్య ను కలిసి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారంతో వచ్చిన సమస్యలతో సతమతం అవుతున్న రామయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News