Saturday, October 5, 2024
HomeతెలంగాణShadnagar: నామినేషన్ దాఖలు చేసిన అంజయ్య యాదవ్

Shadnagar: నామినేషన్ దాఖలు చేసిన అంజయ్య యాదవ్

షాద్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్

షాద్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా అంజయ్య యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా అంజయ్య నామినేషన్ దాఖలు చేయటం విశేషం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దీర్ఘ దృష్టితోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే అభివృద్ధి జరుగుతుందో జరగదో అన్న ఎన్నో సందేహాల మధ్య నేడు దేశంలోనే వ్యవసాయంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగడం ఎంతో సంతోషించదగ్గ విషయమని షాద్నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై. అంజయ్య యాదవ్ అన్నారు.

- Advertisement -

రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి ఆదాయాన్ని బట్టి అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు పెట్టుబడి సహాయం, రైతుబంధు రైతు బీమా పథకాలు రైతన్నలకు ఎంతో లబ్ధి చేకూర్చాయని సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఎంతో అభివృద్ధి జరిగిందని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా సుందరీకరణ పనులు పూర్తి కబడ్డాయాని అన్నారు.

గ్రామాలలో నిర్మించిన స్మశాన వాటికల ఫలితాలు ఇప్పుడు అర్థం కావని భవిష్యత్తులో దాని విలువ ఏంటో తెలుస్తుందని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయని, ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా చివరి దశకు చేరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను రంగాలలో అభివృద్ధి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కుండబద్దలు కొట్టారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మరింత అభివృద్ధి చేసుకునే వీలు కలుగుతుందని, ఈనెల 30వ తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అంతకుముందు హనుమాన్ దేవాలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు

అంతకుముందు షాద్నగర్ ఆర్డీవో కార్యాలయంలో ఉన్న నామినేషన్ కేంద్రాన్ని శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి, స్థానిక ఏసిపి రంగస్వామి, పట్టణ సిఐ ప్రతాప్ లింగం, రూరల్ సీఐ లక్ష్మీరెడ్డి తదితరులు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసు శాఖ పగడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News