ములుగు నియోజకవర్గ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి స్వర్గీయ చందూలాల్ తనయుడు డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ పోటీ చేయడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిజెపి నుండి పోటీ చేయడానికి 9 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అన్ని కోణాలలో పరిశీలించిన పార్టీ ఎట్టకేలకు ప్రహ్లాద్ పేరును అధిష్టానంగా ప్రకటించింది. బిఆర్ఎస్ పార్టీలో దీర్ఘకాలంగా పనిచేసిన ఆయనకు ఆ పార్టీ టికెట్ కేటాయించక పోవడంతో ప్రహ్లాద్ బిజెపి కండువాను కప్పుకున్నారు.
ములుగు మండలం జగ్గన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సారంగపల్లి గ్రామానికి చెందిన ఆయన వైద్య వృత్తిని పూర్తిచేసి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా హైదరాబాదులో ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ గా పనిచేస్తున్నారు. ప్రహ్లాదుకు పార్టీ టికెట్ కేటాయించడంతో పార్టీ శ్రేణులు మంగళవారం ములుగు లోని జాతీయ రహదారిపై టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కాగా స్వర్గీయ చందులాలకు నియోజకవర్గంలో ప్రత్యేక క్యాడర్ ఉంది. పలుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన చందులాల్ అనుచరులు ప్రస్తుత సమయంలో ప్రహల్లాదుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓట్లు ఛీలే అవకాశాలు మెండుగా ఉన్నాయి.