Saturday, April 19, 2025
HomeతెలంగాణSidhipeta: నామినేషన్ దాఖలు చేసిన హరికృష్ణ

Sidhipeta: నామినేషన్ దాఖలు చేసిన హరికృష్ణ

సిద్దిపేట నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్న కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై ప్రజలు విరక్తి చెందారని అన్నారు. పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో విజయం సాధిస్తామని అన్నారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ సాధించామని గుర్తు చేశారు. అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ నైజం అయితే నిజాలను నమ్ముకొని ముందుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రజలను అన్ని విదాలుగా మోసం చేసిందని మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంచేశారు. ఎలాంటి వదంతులను నమ్మకుండా, ప్రలోభాలకు లొంగకుండా ప్రజల కోసం పనిచేసే నాయకునిగా ఆయనను గుర్తించి గెలిపించాలని కోరారు. ఆయనతో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అత్తు , నాయకులు బొమ్మ యాదగిరి తదితరులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News