Sunday, October 6, 2024
HomeతెలంగాణKhammam: తెలంగాణా నుంచి కాంగ్రెస్ ను పారదోలాలి

Khammam: తెలంగాణా నుంచి కాంగ్రెస్ ను పారదోలాలి

మెచ్చాను మంచి మెజార్టీతో గెలిపించాలి

రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు ప్రజలు మద్దతుగా నిలిచి బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేటలో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ నామ ఈ సందర్భంగా అశ్వారావుపేట లో జరిగిన విలేకరుల సమావేశంలో మెచ్చా తో కలసి మాట్లాడారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మూడోసారి కెసిఆర్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేసిన ఘనత కెసిఆర్ కి దక్కుతుందన్నారు. రైతు బంధు పథకం పెట్టి 73 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం ఒక చరిత్ర అన్నారు. దాదాపు రైతులకు సంబంధించి వివిధ పథకాల కింద లక్ష కోట్ల వరకు ఖర్చు చేశారని చెప్పారు. యావత్ రైతాంగం మొత్తం కెసిఆర్ కు అండగా ఉందన్నారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా రైతు రాజ్యాన్ని సాకారం చేశారని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలతో పచ్చ పడుతున్న రాష్ట్రాన్ని చూసి మిగతా పార్టీలకు కన్ను కుట్టిందన్నారు. వారు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని, ప్రజలంతా ఆలోచించాలని అన్నారు.

- Advertisement -

బీఆర్ఎస్ మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉందని, మూడోసారి ప్రభుత్వం ఏర్పడగానే దానిని ఘనంగా అమలు చేసుకుందామని చెప్పారు. రాష్ట్రంలో విద్య, వైద్యం అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు .పార్లమెంట్లో ఎన్నడూ తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల సమస్యల గురించి, తెలంగాణ ప్రజల బాగోగులు గురించి ఏనాడు మాట్లాడని రాహుల్ గాంధీ ఈరోజు ఇక్కడకు వచ్చి అవాకులు చవాకులు పేలుతూ పచ్చి, అబద్దాలు మాట్లాతున్నారని అన్నారు. పార్లమెంట్లో వ్యవసాయ బిల్లును అడ్డుకున్నానని రాహుల్ చెప్పడం విడ్డూరంగా ఉందని , అసలు ఆయన పార్లమెంట్ కే రాలేదని తెలిపారు . కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి పారదోలాలని పిలుపునిచ్చారు. త్వరలో జరిగే అశ్వారావుపేట ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నామ విజ్ఞప్తి చేశారు. రైతుబిడ్డగా
రైతుల సమస్యలు దగ్గరగా చూశానని చెప్పారు. నీళ్లు , కరెంట్, పెట్టుబడి లేక అప్పులు చేసి రైతులు ఆత్మహత్య చేసుకున్న చరిత్ర గతంలో ఉండేదని , కెసిఆర్ వచ్చిన తర్వాత పరిస్థితి బాగుపడిందన్నారు. రైతు సంక్షేమ రాజ్యం తీసుకు వచ్చారని చెప్పారు .
దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగిందని నామ తెలిపారు .


సీఎం కేసీఆర్ పామాయిల్ సాగు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. రానున్న కాలంలో 10 లక్షల ఎకరాల్లో పక్కా ప్రణాళికతో పామాయిల్ సాగుకు చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగా పది పన్నెండు పామాయిల్ ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేయడం జరిగిందని నామ చెప్పారు. రానున్న ఎన్నికల్లో మెచ్చా నాగేశ్వరరావును మంచి మెజార్టీతో గెలిపించి, అసెంబ్లీకి పంపించాలని నామ ఓటర్లకు విజ్ణప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుతో కలసి అశ్వారావుపేట సీఎం ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ విజయవంతానికి పార్టీ నాయకులకు నామా పలు సూచనలు చేశారు. భారీగా తరలివచ్చి, సభను జయప్రదం చేయాలని ప్రజలను నామా కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News