జనగామలో పల్లా విజయం ఖాయం అని మాజీ మంత్రి పొన్నాల జోష్యం చెప్పారు.
జనగామ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండు నామినేషన్ సెట్స్ దాఖలు చేశారు. మొదట ఇంట్లో మహిళామణులు పల్లా దంపతులను మంగళ హరతులతో దీవించ్చారు. అనంతరం భారీ ర్యాలీగా ఆర్డివో కార్యాలయానికి బయలు దేరారు. అధికారి మురళి కృష్ణకు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రావడంతో జనగామ ప్రధాన చౌరస్తా జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాజయ్య, ఏమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ జమున, మండల శ్రీరాములు, సిద్ధి రాములు ఈ ఎన్నికల్లో పల్లా లక్ష ఓట్ల మెజార్టీతో గెలువడం ఖాయమని స్పష్టం చేశారు.
Palla filed nomination: నామినేషన్ దాఖలు చేసిన పల్లా
లక్ష ఓట్లతో పల్లా గెలుపు ఖాయమని అంచనా