గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ పై ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని కోట మైసమ్మ అమ్మవారిని బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ జనసంద్రంతో ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీకి రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి హాజరయ్యారు మీరు వేసే ఓటు కేసీఆర్ కుటుంబానికి వేస్తారా? మీ కుటుంబాలకు వేస్తారా, బిజెపికి ఓటు వేస్తే మీ పిల్లల భవిష్యత్తుకు వేసినట్లు అవుతుందని వారు అన్నారు. కానీ గజ్వేల్ ప్రజలు పులి పిల్లలని అన్నారు. లక్షల కోట్ల రూపాయలు వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేను కలవని ప్రజలు ఎవరైనా ఉన్నారంటే గజ్వేల్ ప్రజలేనని అన్నారు.
ఈటెల గజ్వేల్ నుండి పోటీ చేస్తానని అనగానే కామారెడ్డికి పారిపోయాడని అన్నారు.
రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే బిసి బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించారు.
గజ్వెల్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలు ఉన్నా, నేను పరాయి వాడిని కాదని ఈ నియోజకవర్గ బిడ్డనేనని ఈటెల గుర్తుచేశారు.