Friday, October 4, 2024
HomeతెలంగాణChevella: ఎట్టకేలకు చేవెళ్ల కాంగ్రెస్ లో క్లారిటీ

Chevella: ఎట్టకేలకు చేవెళ్ల కాంగ్రెస్ లో క్లారిటీ

బీ ఫాం అందుకున్న భీమ్ భరత్

చేవెళ్ల నియోజకవర్గం హస్తం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీమ్ భరత్ బీ ఫామ్ విషయంలో రెండు రోజులుగా చెలరేగిన ఉత్కంఠ వీడింది. గాంధీభవన్ లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్ రావు టాక్రే ఏఐసీసీ సెక్రెటరీ మన్సూర్ ఆలీ ఖాన్ చేతుల మీదుగా భీమ్ భరత్ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థిగా బి పామ్ అందుకున్నారు.
క్యాడర్ లో ఇలా మొదలైన సందిగ్ధత
రెండు రోజులుగా చేవెళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ స్థానంలో మరో అభ్యర్థి పేరు ప్రతిపాదన అని వార్తలు రావడంతో ముమ్మర ప్రచారంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో సందిగ్ధం నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరి పేరు ప్రచారం చేయాలని క్యాడర్ సతమతమైది. బీఫామ్ విషయంలో వస్తున్న వార్తలు అవాస్తమని అభ్యర్థి భీమ్ భరత్ ప్రచారంలో పదే పదే చెప్పిన పార్టీ శ్రేణులో సందిగ్ధత మాత్రం వీడలేదు. మంగళవారం గాంధీభవన్ లో భీమ్ భరత్ బి పామ్ తీసుకోవడంతో ఉత్కంఠకు తెరపడింది.

- Advertisement -

చేవెళ్ళలో హస్తం పార్టీ శ్రేణుల సంబరాలు
గాంధీభవన్ లో భీమ్ భరత్ బీఫాం తీసుకోవడంతో నియోజకవర్గ కేంద్రంలో పార్టీ శ్రేణులు భీమ్ భరత్ నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ అంటూ…నినాదాలు చేస్తూ బాణాసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి దామరగిద్ద మాజీ సర్పంచ్ మధుసూదన్ గుప్తా చేవెళ్ళ మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్ వార్డ్ మెంబర్ మల్గారి మల్లారెడ్డి నాయకుల అత్తేల్లి రవీందర్ చాకలి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News