Saturday, April 12, 2025
HomeతెలంగాణKrishnarao @ Begumpet: బేగంపేటను అభివృద్ధి చేసింది మేమే

Krishnarao @ Begumpet: బేగంపేటను అభివృద్ధి చేసింది మేమే

బేగంపేట రూపు రేఖల్ని మరింత గొప్పగా మారుస్తాం

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరితో బేగంపేటలోని మయూర్ మార్గ్.. ప్రకాష్ నగర్.. మాతాజీ నగర్.. శ్యామ్లాల్ మొదలగు ప్రాంతాల్లో పర్యటించి బిఆర్ఎస్ పార్టీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే బేగంపేటలోని ఎన్నో ఏళ్లుగా ఉన్న నాళా సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో ప్రణాళికలు సిద్ధం చేసి దాదాపు 80% పరిష్కరించామని రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

- Advertisement -

ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ బేగంపేట స్మశాన వాటిక పనులు కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో పూర్తి చేసామని ఎంతోమంది ఉద్దండులు వచ్చినా కూడా కానీ ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో స్మశాన వాటిక అందించామని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి పథకాలతో బేగంపేటలోని ఎంతోమంది పేదవారిని ఆదుకున్నామని రాబోయే రోజుల్లో పింఛన్లు 5000 అవుతాయని అలాగే ఆరోగ్య రక్ష వంటి పథకాలతో మరింత అభివృద్ధి దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరు కార్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News