Saturday, April 19, 2025
HomeతెలంగాణMalakpet: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

Malakpet: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

మలక్ పేట్ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అక్బర్

మలక్ పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు.షేక్ అక్బర్ మాట్లాడుతూ తనకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంఐఎం ఎమ్మెల్యే తన సొంత ప్రయోజనాలకు, భూములను ఎలా దోచుకోవాలో పనిలో పడ్డారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి మాత్రం పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మలక్ పేట్ లో రౌడీయిజంకి చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

- Advertisement -

ఒకసారి అవకాశం కల్పించి ఆశీర్వదిస్తే మలక్ పేట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలీ మెహదీ, ముజఫర్ అలీ, ముల్లు కిషన్, విజయ్ సింహరెడ్డి, అశ్వఖాన్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News