రానున్న అసెంబ్లీ ఎన్నికలలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంను అభివృద్ధి చేసుకునేందుకు జంగా రాఘవరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని వరంగల్ వేదిక కన్వీనర్ ఎండి అయూబ్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే వినయ భాస్కర్ నియోజకవర్గ అభివృద్ధిని మరిచారని విమర్శించారు. ముఖ్యంగా మైనార్టీలను విస్మరించి నియోజకవర్గంలోని డివిజన్లను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు మైనార్టీల ముఖం కూడా చూసింది లేదని కనీస అవసరాలను కూడా తీర్చలేదని ఎమ్మెల్యేపై మండిపడ్డారు. రాష్ట్రంలో కూడా అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, సీఎంగా కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో రామ సదానందం, రాచర్ల కుమార్, వై. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.