Sunday, October 6, 2024
HomeతెలంగాణAchchampet: ఊపందుకున్న నామినేషన్ల పర్వం

Achchampet: ఊపందుకున్న నామినేషన్ల పర్వం

నామినేషన్స్ వేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు

అచ్చంపేట పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ పార్టీల అభ్యర్థులైన టిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, బిజెపి పార్టీ తరఫున సతీష్ మాదిగ అచ్చంపేట అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు రిటర్నింగ్ అధికారి గోపి రామ్ కి తమ సెట్లను దాఖలు చేశారు. దీంతో అచ్చంపేట పట్టణంలో ఫుల్ జోష్ తో ఎన్నికల నామినేషన్ల పర్వంతో అన్ని పార్టీల అభ్యర్థులు నాయకులు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్నారు.

- Advertisement -

అంతకుముందు కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి వివిధ పార్టీల అభ్యర్థులు భారీ జనసందోహంతో కలిసి వచ్చి నామినేషన్లు వేశారు. దీంతో నల్లమల్ల ప్రాంతంలో ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీల నాయకులు సై అంటూ వారి వారి పార్టీల మేనిఫెస్టోలో పొందాపరిచిన హామీలను వివరిస్తూ జోరుగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News