మానకొండూర్ మండలంలోని సదాశివపల్లి, శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న జననేత రసమయికి ఘనస్వాగతం పలికారు ఆడబిడ్డలు. కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజలు ఆగమై పోతారంటూ ఆయన నిప్పులు చెరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే కర్ణాటక ప్రజలకు పట్టిన పరిస్థితి వస్తుందని, కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే రైతుల నోట్లో మట్టికొడతారని ఆయన హెచ్చరించారు. అరవై ఏళ్ల కాలంలో చేయని అభివృద్ధి ఇప్పుడు ఏం చేస్తారని కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణ మళ్లీ అంధకారంలోకి వెలుతుందని, కాంగ్రెస్ హామీలకు గ్యారెంటీ లేదన.కవ్వంపల్లి మాటలకు వారంటీ లేదని, మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు.
మానకొండూర్ మండలంలోని సదాశివపల్లి, శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి,లింగాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి, లింగపూర్ గ్రామాల ప్రజలు, ఆడబిడ్డలు డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా బతుకమ్మలు, బోనాలతో ఘనస్వాతం పలికారు.
జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 40మంది మంది బీఆర్ఎస్ లో చేరగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
