అర్చకులపై దాడులను ఆపాలని కర్నూలు లో జంగమ సంక్షేమ సంఘం, బ్రాహ్మణ సంఘల నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలులోని కోట వీరభద్ర స్వామి దేవాలయం అర్చకుడు చంద్రమౌళిని దేవాలయం పక్కన నివాసం ఉంటున్న ఓ వ్యక్తి దాడి చేశారని దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను కోరారు. ఈ దాడిలో అర్చకుడికి కన్ను దెబ్బతినిదని వారు తెలిపారు. ఈఘటనపై జంగమ సంక్షేమం నాయకులు ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగమ సంక్షేమ సంఘం నాయకులు లాల్ బహాదుర్ శాస్త్రి, విశ్వేశ్వరయ్య, గంగాధర్ శాస్త్రి, కోటేశ్వరరావు, చంద్రశేకరయ్య, బసవరాజు, బ్రాహ్మణ సంఘం నాయకులు మనోహార్ రావు, చంద్రశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Attack on Pujari: అర్చకులపై దాడి చేసిన వారిని కచ్చితంగా శిక్షించాలి
చర్యలు తీసుకోకుంటే ఆందోళనలే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES